చిన్నారుల కరోనా టీకాకు కేంద్రం ఆమోదం -2నుంచి18 ఏళ్ల వారు అత్యవసరమైతే Covaxin తీసుకోవచ్చు

చిన్నారులకు కొవిడ్ వ్యాక్సిన్

Bharat Biotech Covaxin for Children : కొవిడ్ మూడో వేవ్ భయాల తీవ్రతను కాస్త తగ్గిస్తూ, మహమ్మారిపై పోరులో భారత్ కీలక అడుగు వేసింది. దేశంలో చిన్నారుల కోసం కొవిడ్ టీకాకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఎమర్జెన్సీ కేసులకు మాత్రమే అనుమతి ఉంది. వివరాలివి..

  • Share this:
కరోన మహ్మారిపై పోరాటంలో భారత్ ఇవాళ కీలక మైలురాయిని దాటింది. కొవిడ్ మూడో వేవ్ తలెత్తితే గనుక చిన్నపిల్లలు ఎక్కువగా బలయ్యే అవకాశాముందనే రిపోర్టుల నేపథ్యంలో ఢిల్లీ నుంచి శుభవార్త వెలువడింది. 2 నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లలు అత్యవసరంగా కొవిడ్ టీకాను వినియోగించేందుకు కేంద్ర సంస్థలు అనుమతిచ్చాయి.

దేశంలో చిన్నపిల్లలకూ టీకా అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతనికి అది అత్యవసర వినియోగానికి మాత్రమే వాడుతారు. భారత్ బయోటెక్ పిల్లల కోసం తయారు చేసిన కొవాగ్జిన్ టీకా అవ్యవసర వినియోగానికి కేంద్ర సంస్థ డ్ర‌గ్స్ అండ్ కంప్ట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి చెందిన స‌బ్జెక్ట్ ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

చిన్నపిల్లల కొవాగ్జిన్ కు సంబంధించి భారత్ బయోటెక్ కొంతకాలంగా జరిపిన క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయి. సెప్టెంబర్ నెలలోనే ట్రయల్స్ పూర్తికాగా, సంబంధిత డేటాను పరిశీలిచన అనంతరం డీసీజీఐ కమిటీ టీకాల వినియోగానికి ఆమోదం తెలిపింది. చిన్నపిల్లల కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ 2, 3 దశల్లో 525 మందిపై ప్రయోగించారు.
Published by:Madhu Kota
First published: