Home /News /national /

Covaxin: కోవాగ్జిన్‌ గురించి మరో గుడ్ న్యూస్.. భారత్ బయోటెక్ ప్రకటన

Covaxin: కోవాగ్జిన్‌ గురించి మరో గుడ్ న్యూస్.. భారత్ బయోటెక్ ప్రకటన

కోవాగ్జిన్

కోవాగ్జిన్

CoronaVirus Vaccine Covaxin: ఓ వైపు ఈ వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతుండగానే.. తమ కంపెనీకి చెందిన కోవాగ్జిన్‌పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది.

    CoronaVirus Vaccine Covaxin: దేశంలో గత పది రోజుల నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. దేశీయంగా సీరం సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్‌తో పాటు భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్‌ డోసులను ముందుగా దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు పంపిణీ చేస్తున్నారు. ఓ వైపు ఈ వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతుండగానే.. తమ కంపెనీకి చెందిన కోవాగ్జిన్‌పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచాన్ని టెన్షన్ పెట్టిన కొత్త రకం కరోనా వైరస్ అయిన యూకే కరోనా వెరియంట్‌పై తమ టీకా సమర్థవంతంగా పని చేస్తున్నట్టు వెల్లడించింది. చైనా నుంచి విస్తరించిన కరోనా వైరస్ కంటే బ్రిటన్‌లో కనుగొన్న కొత్త రకం కరోనా వైరస్ 70 శాతం వేగంగా విస్తరిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కారణంగానే కొన్ని రోజుల పాటు బ్రిటన్ నుంచి ఇతర దేశాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

    బ్రిటన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది తప్ప.. దీని వల్ల అంతగా ప్రాణాపాయం లేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే తమ వ్యాక్సిన్ అయిన కోవాగ్జిన్ కొత్త రకం కరోనా వైరస్‌ను విజయవంతంగా నిలువరిస్తోందని భారత్ బయోటెక్ వెల్లడించింది. దీనికి నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధన లింక్‌ను షేర్‌ చేసింది. ఇదిలా ఉంటే దేశంలో ఇప్పటివరకు కొత్త రకం కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 150కు చేరుకుంది.



    ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 20 లక్షల మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక దేశంలో కొత్త కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 12,689 మందికి కోరోనా నిర్ధారణ కాగా.. 137 మంది మరణించారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు 1,06,89,527 పాజిటీవ్ కేసులు నమోదుకాగా.. 1,53,724 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,76,498 యాక్టివ్ కేసులు ఉన్నాయని, చికిత్స నుంచి కోలుకుని 1,03,59,305 మంది బాధితులు డిశ్చార్జ్ అయినట్లు బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కాగా నిన్న ఒక్కరోజే 13,320 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.91 శాతం కాగా, మరణాల రేటు 1.44 శాతంగా ఉంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Corona Vaccine, COVID-19 vaccine

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు