BHARAT BANDH TRANSPORTERSTRADERS AND FARMERS UNIONS TO PROTESTS AGAINST PETROL DIESEL PRICE HIKE GST SK
Bharat Bandh: నేడు భారత్ బంద్.. పెట్రోల్ రేట్ల పెంపుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు
ప్రతీకాత్మక చిత్రం
Bharat Bandh: CAIT పిలుపుతో దేశవ్యాప్తంగా 40వేల వ్యాపార సంఘాలు, 8 కోట్ల మంది వ్యాపారులు బంద్‌కు మద్దతు తెలుపుతున్నారు. దేశవ్యాప్తంగా చక్కా జామ్ (రాస్తారాకో) నిర్వహిస్తామని యూనియన్ నేతలు తెలిపారు.
నేడు భారత్ బంద్. రోజు రోజు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, కొత్త ఈ-వే బిల్లును వ్యతిరేకిస్తూ ది కన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (AITWA), సంయుక్త కిసాన్ మోర్చా (SKM)తో పాటు పలు ప్రజా సంఘాలు, వ్యాపార సంఘాలు మద్దతు తెలిపాయి. CAIT పిలుపుతో దేశవ్యాప్తంగా 40వేల వ్యాపార సంఘాలు, 8 కోట్ల మంది వ్యాపారులు బంద్‌కు మద్దతు తెలుపుతున్నారు. దేశవ్యాప్తంగా చక్కా జామ్ (రాస్తారాకో) నిర్వహిస్తామని యూనియన్ నేతలు తెలిపారు. 1500 చోట్ల చక్కా జామ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఇవాళ సుమారు 80 లక్షల రవాణా వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోనున్నాయి.
భారత్ బంద్‌కు మద్దతుగా వ్యాపారులంతా తమ ట్రాన్స్పోర్ట్ వాహనాలను ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు బయటకు తీయవద్దని.. ఉన్న ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలని వ్యాపార సంఘాల నేతలు సూచించారు. గోడౌన్ల వద్ద నిరసన బ్యానర్లు ప్రదర్శించాలని కోరారు. ప్రజలంతా శాంతియుతంగా బంద్‌లో పాల్గొనాలని వ్యాపార సంఘాలు విజ్ఞప్తి చేశాయి.
మూడు నెలలుగా ఢిల్లీ శివారులో ఆందోళనలు చేస్తున్న SKM కూడా.. రైతులంతా బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. CAIT పిలుపుతో దేశవ్యాప్తంగా పలు చోట్ల బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్ నుంచి మెడికల్ సర్వీసులు, నిత్యావసర దుకాణాలను మినహాయింపు ఇచ్చారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా.. అందరూ శాంతియుతగా బంద్‌లో పాల్గొంటున్నట్లు వాణిజ్య సంఘాలు తెలిపాయి.
Millions of traders, transporters and tax professionals supported by over 40,000 organisations have united to make tomorrow’s #BharatBandh & #chakkajaam called by @CAITIndia & @aitwa a grand success, to protest against the complexities, anomalies & draconian provisions in #GSTpic.twitter.com/jV9D8zSCYp
— Confederation of All India Traders (CAIT) (@CAITIndia) February 25, 2021
మండుతున్న పెట్రోల్ ధరలను తగ్గించడంతో పాటు కొత్త ఈవే బిల్లును వెనక్కి తీసుకోవాలని వ్యాపార, వాణిజ్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జీఎస్టీ చట్టంలోని నియమ నిబంధనలను పున:సమీక్షించాలని కోరుతున్నాయి. అటు భారత చట్టాలను ఉల్లంఘిస్తున్న అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థల విషయంలో కఠినంగా వ్యవరించాలని డిమాండ్ చేస్తున్నారు.