Bharat Bandh | బంద్‌లో కార్మిక సంఘాలు.. రవాణా, బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం..

కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నేడు దేశవ్యాప్త సమ్మెకు సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీసీ తదితర సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి.

news18-telugu
Updated: January 8, 2020, 10:33 AM IST
Bharat Bandh | బంద్‌లో కార్మిక సంఘాలు.. రవాణా, బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నేడు దేశవ్యాప్త సమ్మెకు సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీసీ తదితర సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ట్రేడ్ యూనియన్లతో పాటు బ్యాంక్ యూనియన్లు కూడా ఈ భారత్ బంద్‌లో పాల్గొంటుండంతో బ్యాంకింగ్, రవాణా వ్యవస్థపై ప్రభావం చూపనుంది. అటు.. 60 విద్యార్థి సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. బ్యాంకుల విలీనం, రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, మరో 12 డిమాండ్లతో సమ్మెకు దిగాయి. కాగా, ఈ సమ్మెకు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, కాంగ్రెస్.. సహా పలు పార్టీలు భారత్ బంద్‌కు మద్దతునిచ్చాయి. ఈ ప్రభావం ఈ రోజు ఉదయం నుంచే కనిపిస్తోంది. కొన్ని చోట్ల రవాణా వ్యవస్థ స్తంభించగా, షాపులు, దుకాణాలను యజమానులు తెరవలేదు.

కాగా, నేటి సమ్మెలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనవద్దని ఇప్పటికే మోదీ సర్కారు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తే చర్యలు తప్పని హెచ్చరించింది. వేతన తగ్గింపు, క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలను ఎదుర్కొనవల్సి వస్తుందని తెలిపింది. అలాగే.. ఉద్యోగులకు ఎవ్వరికీ కూడా సెలవు మంజూరు చేయలేదు. ఒకవేళ మంజూరు చేసినా రద్దు చేయాలని పైఅధికారులను ఆదేశించింది.

First published: January 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు