Home /News /national /

BHAGWANT MANN WILL TAKE OATH AS CHIEF MINISTER OF PUNJAB ON MARCH 16 AK

Punjab: పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం తేదీ ఖరారు.. ఎప్పుడంటే..

పంజాబ్ కాబోయే సీఎం భగవత్ మాన్

పంజాబ్ కాబోయే సీఎం భగవత్ మాన్

Bhagwant Mann: అంతకుముందు ఈ నెల 13న భగవంత్ మాన్ అమృత్‌సర్‌లో కేజ్రీవాల్‌తో కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు.

    పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలను ఊడ్చేసి అధికారంలోకి వచ్చిన ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ఈ నెల 16న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి చర్చించిన అనంతరం ప్రమాణస్వీకారోత్సవ తేదీని ఖరారు చేశారు. ఈ కార్యక్రమానికి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) హాజరుకానున్నారు. అంతకుముందు ఈ నెల 13న భగవంత్ మాన్ అమృత్‌సర్‌లో కేజ్రీవాల్‌తో కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు. ఢిల్లీలో(Delhi) కేజ్రీవాల్‌ను కలిసి భగవంత్ మాన్(Bhagwant Mann).. పంజాబ్‌లో మంత్రివర్గ కూర్పు అంశంపై చర్చించారు. ఈసారి ఎంతోమంది సామాన్యులు కొత్తవాళ్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన పంజాబ్‌లో మంత్రివర్గ కూర్పు ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

    ఒక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి మరో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం ద్వారా దేశ రాజకీయాల్లోనే ఆప్‌ సంచలనం సృష్టించింది. ఆప్ దెబ్బకు పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీతో పాటు పంజాబ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ ఓటమి చవిచూశారు. అకాళీదల్ పార్టీకి చెందిన ప్రకాశ్ సింగ్ బాదల్ సహా అనేకమంది దిగ్గజాలు ఓటమి చవిచూశారు. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్‌ అసెంబ్లీలో ఆప్‌ 92 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్‌ 18, అకాలీదళ్‌ కూటమి 4 స్థానాలతో బాగా వెనుకబడ్డాయి.

    ఈ ఏడాది జనవరి 18న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒకప్పటి స్టాండప్ కమెడియన్, ప్రస్తుత ఆప్ ఎంపీ భగవత్ మాన్ పేరును ప్రకటించింది. ప్రజాభిప్రాయాన్ని బట్టి సీఎం అభ్యర్థిని ఎంపిక చేశామని, వాట్సాప్, మిస్డ్ కాల్, ఎస్సెమ్మెస్ తదితర మార్గాల్లో ప్రజలు తమ ప్రియతమ నేతను సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నారని, భగవంత్ మాన్‌కు 93.3 శాతం మంది మద్దతు పలికారని ఆ సందర్భంలో కేజ్రీవాల్ చెప్పారు. ఆప్ అంచనాలు నిజమవుతూ పంజాబ్ ఫలితాల్లో ఆపార్టీ విజయదుందుభికి సిద్దమైంది.

    సీఎంను ఓడించిన స్వీపర్ కొడుకు: పంజాబ్‌లో సంచలనం.. ఇక దేశాన్ని ఊడ్చేస్తామంటూ..

    Punjab Results 2022: తాగుబోతని తిట్టిపోశారు.. ఇప్పుడాయనే సీఎం అయ్యారు!.. Bhagwant Mann

    పంజాబీ స్టాండప్ కమెడియన్ గా గుర్తింపు పొందిన భగవంత్ మాన్ 2014 మార్చిలో ఆప్‌లో చేరారు. 2014, 2019లలో సంగ్రూర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ఆప్ ఎంపీగా వరుస విజయాలు సాధించారు. ప్రస్తుతం పంజాబ్ ఆప్ శాఖకు కూడా మాన్ చీఫ్ గా ఉన్నారు. ‘ఒకప్పుడు జనం నన్ను చూసి తెగ నవ్వేవారు. కానీ ఇప్పుడు అందరూ రోదిస్తున్నారు. తమను కాపాడమని కోరుతున్నారు’అని సీఎం అభ్యర్థిగా ఎంపికైన రోజు మాన్ వ్యాఖ్యానించారు. తాగుబోతు అనే విమర్శపై స్పందిస్తూ మద్యం మానేశానని, ప్రజాప్రతినిధిగా, పంజాబ్ సీఎంగా బాధ్యతగా మసలుకుంటానని ఎన్నికల ప్రచారంలో మాన్ ప్రజలకు చెప్పారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Punjab

    తదుపరి వార్తలు