Home /News /national /

BHAGWANT MANN TAKES OATH AS NEW CHIEF MINISTER OF PUNJAB AT BHAGAT SINGH VILLAGE DETAILS HERE MKS

Bhagwant Mann: భగవంత్ మాన్ అనే నేను.. భగత్‌సింగ్ సాక్షిగా Punjab సీఎం ప్రమాణం -చిల్లర రాజకీయాలు చేయబోనంటూ

పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణం

పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణం

పంచ నదుల రాష్ట్రం పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పాలన అధికారికంగా మొదలైంది. పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా భగవంత్ సింగ్ మాన్ బాధ్యతలు స్వీకరించారు. చిల్లర రాజకీయాలు చేయబోనని హామీ ఇచ్చారు.

పంచ నదుల రాష్ట్రం పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పాలన అధికారికంగా మొదలైంది. పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా భగవంత్ సింగ్ మాన్ బాధ్యతలు స్వీకరించారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు భ‌గ‌త్ సింగ్ పూర్వీకుల గ్రామం న‌వ‌న్‌ష‌హ‌ర్ జిల్లా ఖ‌ట్క‌ర్ క‌లాన్‌లో ఏర్పాటుచేసిన వేదికపై బుధవారం కొత్త సీఎం ప్రమాణం చేశారు. పంజాబ్ గ‌వ‌ర్న‌ర్ భ‌న్వ‌రిలాల్ పురోహిత్ మాన్‌చే ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఆప్‌ నేతలు, వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు.

పసుపు తలపాగాతో ఆప్‌ మద్దతుదారులు, నేతలు రావడం ఆ ప్రాంగణమంతా ఆకర్షణీయంగా మారింది. కాగా, ఈ ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతిని తరిమికొడతానని, ఉద్యోగాల కల్పన చేపడతానని హామీనిచ్చారు. తాను ఈ రోజు ఎవ్వరినీ విడదీయడానికి లేనని,తమ పార్టీకి ఓటు వేయని వారందరికీ కూడా తాను ముఖ్యమంత్రినేనని అన్నారు. ప్రసంగం చివరిలో ' ఇంక్విలాబ్‌ జిందాబాద్‌' అంటూ భగత్‌ సింగ్‌ నినాదాన్ని వినిపించారు మాన్.

విద్వేష వ్యాపకాలుగా Facebook Twitter.. సోషల్ మీడియాతో రాజకీయ అరాచకం: Sonia Gandhi


ఈ సంద‌ర్భంగా సీఎం మాన్ మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను రెచ్చ‌గొట్టే రాజ‌కీయాల‌కు తాను దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. చిల్ల‌ర రాజ‌కీయాల‌కు దూరంగా వుంటాన‌ని, అందులో త‌ల‌దూర్చ‌న‌ని పేర్కొన్నారు. ‘నాకు ఓటు వేయ‌నివారికి కూడా నేను ముఖ్య‌మంత్రినే. ఇది వారి ప్ర‌భుత్వం కూడా. వారి కోసం కూడా నేను ప‌నిచేస్తాను. ఇది ప్ర‌జాస్వామ్యం. ప్ర‌తి ఒక్క‌రికీ హ‌క్కులుంటాయి. న‌న్ను అహంకారిగా ప్ర‌జ‌లు భావించుకోకూడ‌దు. అలా ప్ర‌వ‌ర్తిస్తాను.’ అని భ‌గ‌వంత్ మాన్ హామీ ఇచ్చారు.

1970 తర్వాత పంజాబ్ కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్లంతా పెద్ద వయసువారే. 52 ఏళ్ల తర్వాత అత్యంత యుక్త వయస్సు గల ముఖ్యమంత్రిగా భగవంత్‌మాన్‌(48) నిలిచారు. ఇటీవలే ముగిసిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 117 స్ధానాల‌కు గాను ఆప్ 92 స్ధానాల్లో గెలుపొంద‌గా పాల‌క కాంగ్రెస్ కేవ‌లం 18 సీట్ల‌తో స‌రిపెట్టుకుని ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకుంది.

Bullet Train: హైదరాబాద్-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు.. వయా చిట్యాల-జగ్గయ్యపేట -మంచి లాభం: Uttam


భగవంత్ మాన్ ను సీఎం అభ్యర్థిగా ఆప్ ఎన్నికలకు ముందే ప్రకటించడం తెలిసిందే. ధురీ అసెంబ్లీ స్ధానం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్ధి ద‌ల్వీర్ సింగ్ గోల్డీపై మాన్ 58,206 ఓట్ల తేడాతో విజ‌యం మాన్ సాధించారు. ఇక ఆప్ ప్ర‌భంజ‌నంతో సీఎం చ‌ర‌ణ్జిత్ సింగ్ చ‌న్నీ, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ, మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ స‌హా ప‌లువురు రాష్ట్ర మంత్రులు, దిగ్గ‌జ నేత‌లు ఓట‌మి చ‌విచూశారు.
Published by:Madhu Kota
First published:

Tags: AAP, Assembly Election 2022, Bhagwant Mann, Punjab

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు