India Corona : ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వేరియంట్ BF.7 పాజిటివ్ కేసుల సంఖ్య ఇండియాలో 4కి చేరింది. ఇలాగే ఊరుకుంటే.. మరిన్ని కేసులు పెరగవచ్చనే ఉద్దేశంతో.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) అత్యవసర ఉన్నతస్థాయి సమావేశానికి పిలుపిచ్చారు. మధ్యాహ్నం ఈ సమావేశం జరగనుంది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ మీటింగ్‌లో పాల్గొనబోతున్నారు. అలాగే ఆరోగ్య శాఖ మంత్రి, ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.
ఈ వేరియంట్ తీవ్రంగా ఉన్న చైనా పక్కనే ఇండియా ఉండటం వల్ల.. భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆల్రెడీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్ని అలర్ట్ చేసింది. ప్రస్తుతం ఇండియాలో 4 కేసులే నమోదవ్వడం వల్ల మనం ఆందోళన చెందాల్సిన పని లేదనీ.. కాకపోతే.. అప్రమత్తంగా ఉంటూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.
BA.5 అనే ఒమైక్రాన్ వేరియంట్‌లో మార్పులు వచ్చి.. BF.7 అనే వేరియంట్ తయారైంది. ఇదే చైనాలో కరోనా పెరిగేందుకు కారణం అయ్యింది. ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ ఎక్కువ కాలం బతకట్లేదు కానీ.. మళ్లీ మళ్లీ వ్యాపిస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా వ్యాపిస్తోంది. అందుకే అందరూ అలర్ట్ అవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona virus, Covid-19