హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Betul Accident: ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన కారు.. 11 మంది మృతి

Betul Accident: ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన కారు.. 11 మంది మృతి

బస్సును ఢీకొన్న కారు

బస్సును ఢీకొన్న కారు

Betul Road Accident: ప్రమాద సమయంలో కారులో 12 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇందులో 11 మంది అక్కడికక్కడే మరణించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Bhopal

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది.  అతివేగంతో అదుపు తప్పిన ఓ కారు.. ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. శుక్రవారం తెల్లవారుఝామున బేతుల్ (Betul Road Accident) జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.  మృతులంతా కారులో ప్రయాణిస్తున్న వారే కావడం గమనార్హం. మృతుల్లో  ఆరుగురు పురుషులు,  ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.  చనిపోయిన వారంతా కూలీలేనని.. వీరంతా మహారాష్ట్ర నుంచి వస్తున్నారని పోలీసులు వెల్లడించారు.  ప్రమాదానికి గురైన బస్సు సీఎం శివరాజ్ సింగ్ కార్యక్రమానికి హాజరై.. తిరిగి వస్తోంది. అందులో ప్రయాణికులు ఎవరూ లేరు. ఖాళీగా వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

బస్సును ఢీకొట్టిన తర్వాత కారు నుజ్జునుజ్జయింది. ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. బస్సు మాత్రం స్వల్పంగా ధ్వంసమైంది.  ప్రమాద సమయంలో కారులో 12 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇందులో 11 మంది అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో .. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారు డ్రైవర్   నిద్ర మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు బేతుల్ ఎస్పీ సిమ్లా ప్రసాద్ తెలిపారు.

గత నెలలో కూడా మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దీపావళికి రెండు రోజుల ముందు..  అక్టోబర్ 21 రాత్రి రేవాలో బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి.  రేవా జిల్లాలోని సోహగి పోలీస్ స్టేషన్ పరిధిలో సోహగి పర్వతం సమీపంలో బస్సు, ట్రక్కు  ఢీకొనడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి యూపీ రాజధాని లక్నోకు వెళ్తుండగా.. ఆ ప్రమాదం జరిగింది.

First published:

Tags: Madhya pradesh, Road accident

ఉత్తమ కథలు