BEST OF JOSH AND HOSH ARMED FORCES TO BE YOUNGER FITTER DIVERSE WITH AGNIVEERS 3 SERVICE CHIEFS AND RAJNATH SINGH ELABORATE ON AGNIPATH SCHEME PVN
Agnipath Scheme : నాలుగేళ్లు సైన్యంలో చేరొచ్చు..మంచి ప్యాకేజీ కూడా..ఆర్మీ రిక్రూట్ మెంట్ లో కొత్త విధానం ప్రకటించిన కేంద్రం
రాజ్‌నాథ్‌సింగ్
Azadi Ka Amrit Mahotsav : రక్షణశాఖ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సాయుధ బాలగాల నియామక ప్రక్రియలో నూతన విధానం తీసుకొచ్చింది. ఆర్మీ(Army)లో యువతను నింపాలనే ఉద్ధేశ్యంతో... అగ్నిపథ్(A రిక్రూట్మెంట్ స్కీమ్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప్రకటించారు.
Agnipath Scheme : రక్షణశాఖ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సాయుధ బాలగాల నియామక ప్రక్రియ(Army Recruitment)లో నూతన విధానం తీసుకొచ్చింది. ఆర్మీ(Army)లో యువతను నింపాలనే ఉద్ధేశ్యంతో... అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్(Agnipath Scheme)ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప్రకటించారు. క్యాబినెట్ కమిటీ ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. అగ్నిపథ్ స్కీమ్ కింద నాలుగేళ్ల కాలపరిమితితో సైన్యంలో పనిచేసే(Jobs) అవకాశాన్ని యవతకు కల్పించనున్నారు. కొత్త టెక్నాలజీతో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. సైన్యంలో చేరే యువత ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. "అగ్నిపథ్" పథకం కింద..సాయుధ దళాల యువత ప్రొఫైల్‌ను రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని,ఇది వారికి కొత్త సాంకేతికతలకు శిక్షణ ఇవ్వడానికి మరియు వారి ఆరోగ్య స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడుతుందని రాజ్ నాథ్ తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఎంపికైన అగ్నీవీరులకి మంచి వేతనం లభిస్తుందని రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) తెలిపారు.
అగ్నిపథ్ స్కీమ్ కింద సైన్యంలోకి సుమారు 45వేల మందిని రిక్రూట్ చేయనున్నారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసులోపు వారే దీంట్లో ఉంటారు. అయితే నాలుగేళ్ల పాటు యువత సర్వీసులో ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత శాశ్వత ప్రాతిపదికన పనిచేసేందుకు వీరు స్వచ్ఛందంగా దరఖాస్తులు పంపే అవకాశం కల్పిస్తారు. మెరిట్, సంస్థాగత అవసరాలను బట్టి.. ఒక్కో బ్యాచ్‌లో 25 శాతం వరకు సభ్యులను శాశ్వతంగా సర్వీసులో చేర్చుకుంటారు. వీళ్లు మాత్రమే 15 ఏళ్ల సర్వీస్‌లో ఉంటారు. మిగతా వాళ్లకు ఎగ్జిట్ రిటైర్మెంట్ ప్యాకేజీ కింద కొంత డబ్బు ఇచ్చి ఇంటికి పంపిస్తారు. వీరికి పెన్షన్ సౌకర్యం ఉండదు.
కాగా,అధికారులు, సైనికుల విభాగాల్లో అగ్నిపథ్ సర్వీసును ప్రారంభించాలని మూడేళ్ల క్రితమే ఆర్మీ వర్గాలు భావించిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణం ఇప్పటివరకు ఇది అమలుకు నోచలేదు. తాజాగా సైనికుల విభాగం వరకు అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. తద్వారా ఆర్మీలో వేతనాలు, పింఛన్ల భారం తగ్గించవచ్చని భావిస్తోంది. షార్ట్ సర్వీసు కమిషన్ కింద యువతకు అవకాశం ఇవ్వడం ద్వారా ప్రస్తుతం ఆర్మీ బెటాలియన్లలో సగటు వయసు 35-36 ఏళ్ల నుంచి 25-26 ఏళ్లకు తగ్గనుంది.
సాయుధ దళాలను అధునికీకరించి, అత్యాధునిక సాంకేతికతతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని..ఇందుకోసం యువతను ఇందులో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉందని మిలిటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరీ తెలిపారు. భవిష్యత్ కాల సైనికులలో అగ్నివీరులు భాగమవుతారని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో వీరిని సిద్ధం చేస్తామని చెప్పారు. . నాలుగేళ్లు సేవలు అందించిన తర్వాత అగ్నివీరుల నేపథ్యం ప్రత్యేకంగా మారుతుందని వీరు అందరికంటే ప్రత్యేకంగా నిలుస్తారని చెప్పారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.