హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

తండ్రీకొడుకుల అనుబంధానికి సాక్ష్యం..గతేడాది మరణించి నాన్న,పెళ్లి మండపంలో కుమారుడికి దీవెనలు

తండ్రీకొడుకుల అనుబంధానికి సాక్ష్యం..గతేడాది మరణించి నాన్న,పెళ్లి మండపంలో కుమారుడికి దీవెనలు

తండ్రి మైనపు విగ్రహం వద్ద యతీష్ దంపతులు

తండ్రి మైనపు విగ్రహం వద్ద యతీష్ దంపతులు

,Father Statue In Wedding : చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా అజ్జంపుర గ్రామానికి చెందిన రమేష్‌ కరోనా సెకండ్‌వేవ్‌లో మృతి చెందారు. రమేష్ కుమారుడు యతీష్‌ మైసూరులో ఆయుర్వేద వైద్య కళాశాలలో ఎండీ కోర్సు పూర్తి చేశాడు.

Wedding In Front Of Father Statue : కుటుంబసభ్యుల్లో ఎవరైనా దూరమైతే వారి జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తుంటారు. శుభకార్యాల్లో వారు లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. అయితే కొందరు వారి లోటును పూడ్చుకునేందుకు మైనపు విగ్రహాలు తయారు చేయిస్తూ కార్యక్రమాలను జరిపిస్తున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. తాజాగా కర్ణాటక ఇలాంటి సంఘటన మరొకటి జరిగింది. దివంగతులైన తండ్రికి మైనపు విగ్రహం చేయించి ఆప్రతిమ ఎదురుగానే తాను ఇష్డపడిన యువతిని పెళ్లి చేసుకున్నాడు తనయుడు. తండ్రీకొడుకుల అనుబంధానికి సాక్ష్యంగా నిలిచే ఈ సన్నివేశం మైసూరు జిల్లా నంజనగూడు పట్టణంలోని సంతాన గణపతి కల్యాణమండపంలో శనివారం చోటు చేసుకుంది.

చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా అజ్జంపుర గ్రామానికి చెందిన రమేష్‌ కరోనా సెకండ్‌వేవ్‌లో మృతి చెందారు. రమేష్ కుమారుడు యతీష్‌ మైసూరులో ఆయుర్వేద వైద్య కళాశాలలో ఎండీ కోర్సు పూర్తి చేశాడు. నంజనగూడు తాలూకా మేల్కుండి గ్రామానికి చెందిన డాక్టర్‌ అపూర్వతో యతీష్‌కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. అయితే నాన్నంటే ఎంతో ఇష్టం ఉన్న యతీష్... తన పెళ్లి తండ్రి సమక్షంలోనే జరగాలనుకున్నాడు. అప్పుడే యతీశ్​కు ఒక ఐడియా తట్టింది. తన తండ్రి మైనపు విగ్రహం చేయించాడు. శనివారం విగ్రహాన్ని కల్యాణమండపానికి తీసుకొచ్చి ఆయన కళ్లెదుటే అపూర్వ మెడలో తాళి కట్టాడు. అనంతరం తండ్రి మైనపు విగ్రహం పక్కనే ఆసనం వేసి అందులో తల్లిని కూర్చోబెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు.

ALSO READ Navneet Kaur: ఎనీ సెంటర్..దమ్ముంటే నాపై పోటీ చేసి గెలువ్..సీఎం ఉద్దవ్ కి నవనీత్ కౌర్ సవాల్

యతీష్​ తల్లి.. మైనపు విగ్రహం పక్కనే కూర్చొని పెళ్లి తంతు జరిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అచ్చం జీవం ఉన్న మనిషిని పోలిన మైనపు బొమ్మను చూసి బంధువులు, అతిథులు ఆశ్చర్యపోయారు. తన తండ్రి స్వయంగా ఆశీర్వదించినట్లే ఉందని ఆనందపడిపోయాడు యతీష్. ఈ సందర్భంగా యతీష్ మాట్లాడుతూ.."మా నాన్న గతేడాది కరోనా సోకి చనిపోయారు. ఆయనను మరిచిపోలేకపోతున్నాం. ఆయన లేకుండా పెళ్లి చేసుకోలేను. అప్పుడే కుటుంబంతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చా. నా తండ్రి మైనపు విగ్రహాన్ని తయారుచేయించా. ఇప్పుడు మా నాన్న మాతో ఉన్నట్లే అనిపిస్తోంది"అని తెలిపారు.

First published:

Tags: Karnataka, Marriage

ఉత్తమ కథలు