హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పబ్ కు పిలిచి లవ్ ప్రపోజల్.. కాస్త టైమ్ కావాలన్న యువతి రెస్పాన్స్ తో ఆ యువకుడు ఏం చేశాడంటే..

పబ్ కు పిలిచి లవ్ ప్రపోజల్.. కాస్త టైమ్ కావాలన్న యువతి రెస్పాన్స్ తో ఆ యువకుడు ఏం చేశాడంటే..

ఓ యువకుడు తాను ప్రేమిస్తున్న యువతికి ప్రపోజ్ చేశాడు. ఆ యువతి మాత్రం ’నాకు కాస్త టైమ్ కావాలి. నా తల్లిదండ్రులతో మాట్లాడాలి‘ అని రెస్పాన్స్ ఇచ్చింది. అంతే ఆ యువకుడికి పిచ్చెక్కిపోయింది. ఊహించని రీతిలో అతడి ప్రవర్తన చూసి అంతా షాకయ్యారు.

ఇంకా చదవండి ...

  ఓ యువకుడు తాను ప్రేమిస్తున్న యువతికి ప్రపోజ్ చేశాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆ యువతి మాత్రం ’నాకు కాస్త టైమ్ కావాలి. నా తల్లిదండ్రులతో మాట్లాడాలి‘ అని రెస్పాన్స్ ఇచ్చింది. అంతే ఆ యువకుడికి పిచ్చెక్కిపోయింది. ఊహించని రీతిలో అతడి ప్రవర్తన చూసి అంతా షాకయ్యారు. ఆ యువతి ఆస్పత్రి పాలయింది. అతడిపై కేసు పెట్టింది. బెంగళూరు నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో తానిషాంద్రకు చెందిన ఓ యువతికి ఎరిక్ చార్లెస్ అనే స్నేహితుడు ఉన్నాడు. అతడు గత శనివారం ఆమెను పబ్ కు పిలిచాడు. ఆమె తన స్నేహితులతో కలిసి శనివారం సాయంత్రం 6గంటలకు పబ్ కు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత చార్లెస్ ఆ పబ్ కు చేరుకున్నాడు.

  ఆ పబ్ లోనే అందరి ముందు ఆమెకు ప్రపోజ్ చేశాడు. ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందామా అంటూ కోరాడు. ఈ హఠాత్పరిణామంతో ఆమె కంగుతింది. ఆమె ఏం సమాధానం చెప్పాలో తెలియక కాసేపు అలాగే ఉండిపోయింది. ’నాకు కాస్త సమయం కావాలి. ఆలోచించుకుని చెబుతాను. నా తల్లిదండ్రులతో మాట్లాడాలి.‘ అని ఆ యువతి చెప్పింది. ’నేను లవ్ ప్రపోజ్ చేస్తే కాదంటుందా.. టైమ్ కావాలంటుందా‘ అంటూ ఆ చార్లెస్ కు ఆగ్రహం తన్నుకొచ్చింది. అంతే అతడిలోని అపరిచితుడు బయటకు వచ్చాడు.

  ఇది కూడా చదవండి: కొద్ది గంటల్లో పెళ్లనగా ప్రియుడితో వధువు ఎస్కేప్.. ఆమె చెల్లెలితో వరుడి పెళ్లి.. అంతలోనే మరో షాక్..!

  ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ ను తీసుకున్నాడు. ఆమె బ్యాగులో ఉన్న ఏటీఎం కార్డును కూడా లాగేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాల పాలయిన ఆమెను స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. ట్రీట్ మెంట్ తర్వాత కోలుకున్న ఆమె గురువారం అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుందామంటూ తనను బలవంతం చేశాడని ఆమె కేసు పెట్టింది. తన వద్ద నుంచి మొబైల్ ను లాక్కున్నాడనీ, ఏటీఎం కార్డును కూడా తీసుకన్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. తన ఏటీఎం కార్డు నుంచి ఇప్పటికే 45వేల రూపాయలు విత్ డ్రా చేసినట్టు తనకు మెసేజ్ లు వచ్చాయని చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడి కోసం గాలిస్తున్నారు.

  ఇది కూడా చదవండి: పెళ్లి మండపం నుంచి వరుడు ఎస్కేప్.. వధువు చేసిన పనికి అంతా షాక్.. పెళ్లి బట్టల్లో ఉండే..

  First published:

  Tags: Bengaluru, Crime news, Love cheating, Love marriage, Lovers suicide

  ఉత్తమ కథలు