హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Puneeth Rajkumar: వ్యాయామం వారి పాలిట ప్రాణాపాయం -చివరి క్షణాల్లో ఏం జరిగింది?

Puneeth Rajkumar: వ్యాయామం వారి పాలిట ప్రాణాపాయం -చివరి క్షణాల్లో ఏం జరిగింది?

పునీత్ రాజ్ కుమార్

పునీత్ రాజ్ కుమార్

రాజ్ కుమార్ కుటుంబం మొత్తం వ్యాయామం చేస్తున్న క్రమంలోనే ప్రాణాలు కోల్పోవడం, ప్రాణాపాయాన్ని ఎదుర్కోవడం, పునీత్ రాజ్ కుమార్ కు హృదయ స్పందన లేకున్నా మూడు గంటలపాటు చికిత్స అందించడం, డాక్టర్లు నిర్ధారించకముందే టాలీవుడ్ ప్రముఖులు పునీత్ మరణాన్ని కన్ఫామ్ చేయడం చర్చనీయాంశాలయ్యాయి..

ఇంకా చదవండి ...

కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణానికి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్లు అధికారికంగా ధృవీకరించడానికి ముందే టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కొందరు పునీత్ మరణవార్తను లీక్ చేయడం చర్చనీయాంశమైంది. ఇంట్లోని జిమ్ లో కుప్పకూలిపోయినప్పటి నుంచి పునీత్ విషయంలో అసలేం జరిగిందో డాక్టర్లు వెల్లడించారు. అదేక్రమలో రాజ్ కుమార్ ఫ్యామిలోని పురుషులు అందరూ గుండెపోటుకు గురికావడం, అది కూడా వ్యాయమం చేస్తున్న క్రమంలోనే ప్రాణాపాయాన్ని ఎదుర్కోవడంపై ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి..

నటుడిగానే కాక సామాజిక సేవతోనూ పాపులరైన పునీత్‌ రాజ్‌కుమార్‌ 46ఏళ్ల వయసులోనే హఠాన్మరణం చెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో బెంగళూరు సిటీలోని సదాశివనగరలో గల తన ఇంట్లోనే పునీత్ జిమ్‌ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. అది గమనించిన కుటుంబీకులు.. పునీత్‌ను సమీపంలోని రమణశ్రీ క్లినిక్‌కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలోని విక్రమ్‌ ఆస్పత్రికి తరలించగా ఐసీయూలో ఉంచి, వైద్యం ప్రారంభించారు. అయితే, ఆస్పత్రిలో చేరే సమయానికే పునీత్ కు హృదయ స్పందన లేదని డాక్టర్లు చెబుతున్నారు.

Puneeth Rajkumar: అనూహ్య ఘటనలు -అంత్యక్రియలు మరింత ఆలస్యం -ఆ దారిలో రక్తపాతం


పునీత్‌ కుప్పకూలిన వెంటనే వారి ఫ్యామిలీ డాక్టర్ అక్కడికి చేరుకున్నారని, ఆయన ఆధ్వర్యంలో ఈసీజీ తీయగా, గుండెపోటు అని నిర్ధారణ అయ్యాకే తమ ఆస్పత్రికి వచ్చినట్లు విక్రమ్‌ ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు. పునీత్‌ను విక్రమ్ ఆస్పత్రికి తీసుకు వచ్చినప్పుడు ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారని, హృదయ స్పందన లేదని వైద్యులు పేర్కొన్నారు. అయినప్పటికీ మూడు గంటల పాటు తీవ్రంగా ప్రయత్నించామన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు చనిపోయినట్లుగా తాము నిర్ధారించినట్లు ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలోగానీ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై.. పునీత్ మరణాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ ఉదయం 12 గంటల సమయంలోనే టాలీవుడ్ మా అధ్యక్షుడు మంచు విష్ణు సోదరి మంచు లక్ష్మీ.. పునీత్ మరణాన్ని ధృవీకరిస్తూ ట్వీట్ చేశారు. పునీత్ మరణంపై టీవీల్లో గందరగోళంపైనా మంచు లక్ష్మి స్పందించారు. ఇదిలా ఉంటే,

Puneeth Rajkumar: అనూహ్య ఘటనలు -అంత్యక్రియలు మరింత ఆలస్యం -ఆ దారిలో రక్తపాతం


రాజ్ కుమార్ కుటుంబం మొత్తం వ్యాయామం చేస్తున్న క్రమంలోనే ప్రాణాలు కోల్పోవడం, ప్రాణాపాయాన్ని ఎదుర్కోవడం చర్చనీయాంశమైంది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ 2006లో.. వాకింగ్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన వెంటనే కూర్చున్న సోఫాలోనే కుప్పకూలిపోయారు. పునీత్ రాజ్ కుమార్ కూడా జిమ్ చేస్తూనే ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఆయన సోదరుడు శివరాజ్ కుమార్ సైతం గుండెపోటుకు గురయ్యారు. పునీత్ మరోసోదరుడు రాఘవేంద్ర జిమ్ చేస్తుండగా పక్షవాతానికి గురయ్యారు. ఇలా ఫ్యామిలీ మొత్తం వ్యాయామం చేస్తున్న క్రమంలోనే విషాదాలు ఎదుర్కోవడం గమనార్హం. పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఆదివారం జరుగనున్నాయి. బెంగళూరులోని కంఠీరవ స్టుడియోలో తండ్రి సమాధి పక్కనే పునీత్ ను ఖననం చేయనున్నారు.

First published:

Tags: Bengaluru, Kannada Cinema, Karnataka, Puneeth RajKumar

ఉత్తమ కథలు