ఎప్పటికైనా ఐఏఎస్ సాధించాలనేది అతడి కల. ఆ దిశగా కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతున్నాడు. మాయదారి సోషల్ మీడియా అతని కొంప ముంచుతుంది అనుకోలేదు. ఓ రోజు అతడి ఫేస్ బుక్ ఖాతాకు ఓ అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అతడు దానిని అంగీకరించాడు. ఆ పరిచయం కాస్త మెస్సెజ్ మొదలై న్యూడ్ వీడియో కాల్ చేసుకునే వరకు వెళ్లింది. ఓ రోజు తన మొబైల్ కు తన న్యూడ్ వీడియో పంపారు. అదే ఫోన్ నంబర్ నుంచి పంపించినట్లు గుర్తించాడు. ఆ రోజు నుంచి అతడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం అనే బెదిరింపులు మొదలయ్యాయి. ఈ సమస్యను అతడు ఎవ్వరికీ చెప్పుకోలేక పోయాడు. తనలో తానే మదన పడ్డాడు. పరిచయమైన అమ్మాయి ఇలా చేస్తుందనుకోలేదంటూ కుమిలిపోతూ ఓ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఏఎస్ కావాల్సిన యువకుడు అర్ధాంతరంగా తనువు చాలించడంతో.. ఎందుకు చనిపోయాడో తెలియక కుటుంబ సభ్యులు బాధపడతుండగా.. చనిపోయిన సోదరుడి ఫోన్ కి మెసేజ్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. సైబర్ కేటుగాళ్ల వేధింపులతోనే తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బెంగళూరులోని చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.
బెంగళూరులోని భత్తరహళ్లికి చెందిన ఓ యువకుడు ఐఏఎస్ సాధించాలనే ధ్యేయంతో సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. అతని ఫేస్బుక్ అకౌంట్‌కి ఓ అమ్మాయి నుంచి ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ వచ్చింది. అదే అతని ప్రాణం తీస్తుందని అనుకోలేదు . అతడు ఆ రిక్వెస్ట్ ను ఓకే చేశాడు. ఆ మరుసటి రోజు నుంచి యువకుడిని కవ్వించి న్యూడ్ వీడియో కాల్ వరకూ తీసుకెళ్లింది. అది రికార్డ్ చేసుకున్న అవతలి వ్యక్తి ఓ రోజు అదే వీడియో లను అతని ఫోన్ కే పంపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు. కొద్దిసేపటికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో అతనికి సీన్ అర్థం అయిపోయింది. అది కచ్చితంగా సైబర్ నేరగాళ్ల పనే అని. అతడిని బ్లాక్ మెయిల్ చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతడు ఏ కారణం చేత ప్రాణాలు తీసుకున్నాడో అర్థం కాలేదు. ఏమైందో తెలియక మదనపడుతున్న సమయంలో ఓ రోజు చనిపోయిన అతని అన్నకు ఓ మెసెజ్ వచ్చింది. విషయం గ్రహించిన అతడు తన చెల్లెలకు చెప్పాడు. సైబర్ నేరగాళ్ల వేధింపులతోనే తన అన్న చినిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు తెలసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ డేటా ఆధారంగా ఆ నేరగళ్ల ఆచూకీ తెలుసుకున్నారు. రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాకు చెందిన రాబిన్(22), జావేద్(25)ను నిందితులుగా గుర్తించారు. బెంగళూరు నుంచి స్పెషల్ టీం రాజస్థాన్ కు బయలుదేరింది. అక్కడ వారిని పట్టుకున్న తర్వాత పోలీసులకు అక్కడ గ్రామస్తులు ఎదురుదాడికి దిగారు. నిర్ఘాంతపోయే విషయాలు బయటకు వచ్చాయి. విషయం వెంటనే భరత్పూర్ ఎస్పీకి తెలియజేయడంతో ఆయన సుమారు 40 మంది స్థానిక పోలీసులను సాయంగా పంపించడంతో అతికష్టమ్మీద నిందితులను అరెస్టు చేసి బెంగళూరుకు తీసుకొచ్చారు.
విచారణలో పోలీసులకు నిర్ఘాంతపోయే విషయాలు బయటకు వచ్చాయి. చనిపోయిన యువకుడిని కేవలం ఫోన్ ద్వారానే ట్రాప్ చేసినట్లు తెలిపారు. నకిలీ ఫేస్బుక్ ఐడీ క్రియేట్ చేసి అతడికి మెస్సెజ్ లు పంపిస్తూ వలలో వేసుకున్నారు. అమ్మాయిలా కవ్విస్తూ స్మార్ట్‌ఫోన్ సాయంతో యువతి న్యూడ్ వీడియో కాల్ చేస్తున్నట్లు నమ్మించారు. ఆ వైపు అమ్మాయి బట్టలు విప్పుతున్నట్లు క్రియేట్ చేసి అతడు న్యూడ్ వీడియో కాల్ చేసే విధంగా మార్చారు. ఆ తరువాత వీడియోను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. అయితే అటు వైపు అమ్మాయి లేనే లేదు. కేవలం అమ్మాయి ఉన్నట్లు నటించి నోటి నుంచి మాట రాకుండా మొఖం కనిపించకుండా అతడిని ట్రాప్ లో పడేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. ఇటువంటి కేటుగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attemt to suiciede, Bengaluru, Bengaluru youth died, Crime, Crime news, CYBER CRIME, Nude video, Nude video calls, Nude videos blackmails, Rajasthan