BENGALURU THIS BENGALURU BASED START UP IS OFFERING 3DAYS WORK WEEK KNOW FULL DETAILS BA
3 Day Work Week: వారానికి మూడు రోజులే వర్క్.. కొత్త స్టార్టప్ కొత్త ఐడియా.. మన దగ్గరే.. జీతాలు కూడా..
ప్రతీకాత్మక చిత్రం
3 Day Work Week in India | ప్రపంచదేశాల్లో ఇదో బెస్ట్ ప్రాక్టీస్. ఉద్యోగులకు మంచి శాలరీ వస్తుంది. అలాగే కంపెనీ నుంచి లభించే అన్ని ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇతరత్రా పనులు చూసుకోవచ్చు. తమ కలలను సాకారం చేసుకోవచ్చు.
ప్రస్తుతం కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి కారణంగా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from Home) అవకాశం కల్పించాయి. దాదాపు ఏడాదిన్నరకు పైగా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడిప్పుడే వారిని మళ్లీ ఆఫీసులకు రప్పించేందుకు కొత్త కొత్త ఐడియాలతో కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో వారానికి ఐదు రోజుల పని దినాలను (Five Days week) తప్పించి వారానికి నాలుగు రోజుల వర్కింగ్ డేస్ ఇవ్వాలని కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ స్టార్టప్ ఇంకో అడుగు ముందుకు వేసింది. ఈ కంపెనీ ఏకంగా వారానికి మూడు రోజులు వర్కింగ్ డేస్ (3 day work week) ప్రకటించింది. ఈ కంపెనీ ఏంటి? ఎక్కడ ఉంది? ఎలాంటి సేవలు అందిస్తుంది? తెలుసుకుందాం.
బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఈ త్రీ డేస్ వర్క్ తీసుకొచ్చింది. ఫైనాన్షియల్ టెక్నాలజీ సేవలు అందించే స్లైస్ (Slice) సంస్థ ఈ మూడు రోజులు పని విధానాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో అందిస్తున్న జీతాలకు ఓ 20 శాతం తగ్గించి ఉద్యోగులను తీసుకుంటారు.
ఈ విధానం ద్వారా ఇద్దరికీ ప్రయోజనం. అటు కంపెనీకి లాభం. ఇటు ఉద్యోగులు హ్యాపీ. ఆ మిగిలిన నాలుగు రోజుల్లో ఉద్యోగులు తమకు నచ్చిన పని చేసుకోవచ్చు. చదువుకోవాలనుకునే వారు చదువుకోవచ్చు. ఇతర వ్యాపకాలు ఉంటే వాటితో బిజీ అయిపోవచ్చు. ఫ్యామిలీతో కూడా గడిపే సమయం ఉంటుంది. ఇది ఫ్యూచర్ ఆఫ్ వర్క్.
— బ్లూమ్ బర్గ్‌తో రాజన్ బజాజ్, స్లైస్ ఫౌండర్
భారత టెక్ స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశాలకు చెందిన పెద్ద పెద్ద కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మెరికల్లాంటి యువతను రిక్రూట్ చేసుకోవడానికి ఈ స్టార్టప్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ త్రీ డేస్ వర్క్ కూడా ముందుకొచ్చింది. ప్రస్తుతం స్లైస్ కంపెనీలో 450 మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చే మూడు సంవత్సరాల్లో 1000 మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ప్రొడక్ట్ మేనేజర్లను రిక్రూట్ చేసుకోవడానికి కంపెనీ ప్లాన్ చేస్తోంది.
ప్రపంచదేశాల్లో ఇదో బెస్ట్ ప్రాక్టీస్. ఉద్యోగులకు మంచి శాలరీ వస్తుంది. అలాగే కంపెనీ నుంచి లభించే అన్ని ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇతరత్రా పనులు చూసుకోవచ్చు. తమ కలలను సాకారం చేసుకోవచ్చు.
తాజాగా టీఏసీ సెక్యూరిటీ అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ వారానికి నాలుగు రోజుల వర్క్ ప్రవేశ పెట్టింది. సోమవారం నుంచి గురువారం వరకు పని చేస్తే శుక్ర, శని, ఆదివారాల్లో హాలిడే ఉంటుంది. గత ఏడు నెలల నుంచి కంపెనీలో ఈ విధానం అమలవుతోంది. దీని వల్ల ఎంతో ప్రయోజనం కూడా ఉందని, కంపెనీలో ఉత్పత్తి పెరిగిందని తెలిపింది. దీని వల్ల ఉద్యోగులు హ్యాపీగా ఉంటారు. దీంతో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.