Home /News /national /

BENGALURU THE SADISTIC HUSBAND POSTED A PHOTO AND PHONE NUMBER OF HIS TIED UP WIFE ON SOCIAL MEDIA IN KARNATAKA STATE VB

శాడిస్ట్ గా మారిన భర్త.. భార్యకు సంబంధించి ఫోన్ నంబర్, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్.. విపరీతమైన కాల్స్, అశ్లీల మెసేజ్ లు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime News: కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి సైకో అవతారమెత్తాడో భర్త. భార్య ఫోటోను, ఆమె ఫోన్‌ నంబరును ఇంటర్నెట్లో పోస్ట్‌చేసి వ్యభిచారి అని రాసిన ఘరానా భర్త పై కర్ణాటక తూర్పు విభాగం మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    కట్టకున్న భార్య ఫొటోను, ఆమె మొబైల్ నంబర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వ్యభిచారి అని రాశాడో శాడిస్ట్ భర్త. అంతే కాకుండా చెప్పిన పని చేయకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. చివరకు ఆమె భయపడి పోయి ఇంటి నుంచి వెళ్లి హాస్టల్ లో తలదాచుకుంది. అప్పటికీ తన వేధింపులు ఆగకపోవడంతో చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిని పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మళ్లీ ఇలాంటిది జరిగితే చర్యలు తీసుకుంటామని కూడా బెదిరించారు. అయినా అతడిలో మార్పు రాలేదు. ఫేస్ బుక్ లో నకిలీ ఐడీ క్రియేట్ చేసి అందులో ఎస్కార్ట్స్‌ సర్వీస్‌ అని అప్‌లోడ్‌ చేశాడు. దీంతో ఆమె ఫోన్ నంబర్ కు విపరీతమైన కాల్స్, అశ్లీల మెసేజ్ లు రావడం మొదలైంది. దీనిపై ఆరా తీయగా ఈ పని చేసింది తన భర్తే అని తెలుసుకొని మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పూర్తి సమాచారం ఇలా ఉంది.

    కర్ణాటకకు చెందిన జయశంకర్‌ కుమార్ సింగ్(29) ఒక ప్రైవేటు కంపెనీలో ఇంజీనీర్‌గా పనిచేసేవాడు. ఇందిరా నగర్ కు చెందిన ఓ మహిళా టెక్కీ(25)తో 2019 లో వివాహమైంది. ఇద్దరు పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ వెళ్లేవారు. ఇంటి ఖర్చుల వరకు ఆమె భరించేది. మిగతా ఖర్చుల వరకు అతడి సంపాదనతో కుటుంబాన్ని వెళ్లదీస్తున్నారు. అయితే కొన్ని రోజుల వరకు వారిద్దరు బాగానే ఉన్నా తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పటి నుంచి అతడు ఆమెను పుట్టింటి వారితో మాట్లాడొద్దని కట్టడి చేస్తూ వస్తున్నాడు. చిన్న విషయానికి కూడా గొడవ పడుతూ వేధించేవాడు. అంతటితో ఆగకుండా తన మొబైల్ కు అశ్లీల మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ పంపించి వేధించేవాడు.

    ప్రశ్నిస్తే పొడిచి చంపుతానని బెదిరించడంతో ఆమెకు ప్రాణభయం ఏర్పడింది. దీంతో భర్త నుంచి దూరంగా ఉండాలని ఒక పీజీ హాస్టల్‌లో తలదాచుకుంది. అయినా వేధింపులు ఆగకపోవడంతో ఆహె హలసూరు పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయగా, ఇకపై బుద్ధిగా ఉంటానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అయినా అతడిలో మార్పు కనిపించలేదు. ఆమె పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్‌ సృష్టించి అందులో ఆమె మొబైల్‌ నెంబరు పెట్టి ఎస్కార్ట్స్‌ సర్వీస్‌ అని అప్‌లోడ్‌ చేశాడు. దీంతో ఆమె ఫోన్‌కు విపరీతంగా కాల్స్, అసభ్య సందేశాలు రావడం మొదలైంది. దీంతో ఆరా తీయగా భర్త పాడుపని గురించి తెలిసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime, Crime news, Karnataka, Wife and husband

    తదుపరి వార్తలు