హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Boyfriend On Rent : బెంగళూరులో అద్దెకు బాయ్ ఫ్రెండ్ సర్వీసులు ప్రారంభం..ఆ పనికి గంటల లెక్కన ఫీజు

Boyfriend On Rent : బెంగళూరులో అద్దెకు బాయ్ ఫ్రెండ్ సర్వీసులు ప్రారంభం..ఆ పనికి గంటల లెక్కన ఫీజు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Boyfriend On Rent : ఈ రోజుల్లో అన్నీ ఆన్‌లైన్‌లోనే దొరుకుతున్నాయి. ఆన్ లైన్ ద్వారా ఏదైనా సరే ఇంట్లో నుంచి కాలు కదపకుండానే కొనేస్తున్నాం,తినేస్తున్నాం, సినిమా చూసేస్తున్నాం,షాపింగ్ చేసేస్తున్నాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Boyfriend On Rent : ఈ రోజుల్లో అన్నీ ఆన్‌లైన్‌లోనే దొరుకుతున్నాయి. ఆన్ లైన్ ద్వారా ఏదైనా సరే ఇంట్లో నుంచి కాలు కదపకుండానే కొనేస్తున్నాం,తినేస్తున్నాం, సినిమా చూసేస్తున్నాం,షాపింగ్ చేసేస్తున్నాం. తాజాగా వీటి జాబితాలోకి ప్రేమించుకోవడం కూడా వచ్చి చేరింది. ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్‌ ఉండటం కామన్. కానీ, ఎంతగానో ఇష్టపడ్డ బాయ్ ఫ్రెండ్‌(Boyfriend) ఏదో ఒక రోజు దూరం పెట్టొచ్చు. దీంతో అమ్మాయిుల్లో చాలా మంది తీవ్ర వేదనకు గురవుతుంటారు. ఇష్టపడ్డ వ్యక్తి మోసం చేశాడని, కోరుకున్న ప్రేమ దక్కలేదని బాధపడుతుంటారు. అలాంటి వాళ్లకోసమే బెంగళూరు(Bengaluru)కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ వినూత్నంగా ఆలోచించించింది. ప్రియుడు వంచించాడనో, ప్రేమ విఫలమైందనో, నిజమైన ప్రేమ దక్కలేదనో కుంగిపోయిన వారికి బాయ్ ఫ్రెండ్ ను అద్దెకు ఇచ్చేందుకు 'Toy boy' అనే వెబ్‌ పోర్టల్ ని,యాప్ ని ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం లవ్ బ్రేకప్ అయిన లవర్స్‌ను కాపాడటమే అని తెలిపింది. గంటలెక్కన బాయ్ ఫ్రెండ్ ను అద్దెకిస్తామని కంపెనీ చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

అయితే  "బాయ్‌ ఫ్రెండ్" ఎవరి దగ్గరికీ భౌతికంగా రాడు. ఫోన్‌ ద్వారా వారి సమస్యను పూర్తిగా విని మానసిక ఆందోళనను దూరం చేసేందుకు సహకారం అందిస్తాడని పోర్టల్‌ను అభివృద్ధి చేసిన కౌశల్‌ ప్రకాశ్‌ తెలిపారు. బాయ్ ఫ్రెండ్‌ను అద్దెకు తీసకున్న వారు వాళ్లతో కలిసి షాపింగ్‌, రెస్టారెంట్లు, పార్కులకు వెళ్లడం సెక్స్ చేసుకోవడం నిషిద్ధం. బాయ్ ఫ్రెండ్ కేవలం ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉండాడు. యూజర్లు తమ పోర్టల్ లేదా యాప్ ద్వారా ఈ సేవలు పొందొచ్చు. దీనికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. గంటల లెక్కన ఛార్జ్ చేస్తారు. కాగా, జపాన్ వంటి పలు దేశాల్లో ఈ తరహా సేవలు అందుతున్నాయి.

Viral Photo : శవపేటిక టైప్ లో ఆఫీసులో కుర్చీలు..వర్క్ చేస్తూ చనిపోతే మూసేసి తీసుకెళ్లడమే

మానసికంగా బాధపడేవారికి, ఒంటరితనంతో బాధపడేవారికి సానుకూలమైన మాటలతో ధైర్యం చెప్పడానికి, కౌన్సెలింగ్ ఇవ్వడానికి ఇప్పటికే చాలా వెబ్ సైట్లు ఉన్నాయి. అయితే ప్రేమలో విఫలమైన యువతులను ఉద్దేశించి టాయ్ బామ్ పేరుతో అబ్బాయిలను అద్దెకు ఇస్తామనడమే ప్రస్తుతం ఇక్కడ వివాదాస్పదమైంది. ఇక దీనిపై ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. . కాగా, జపాన్ వంటి పలు దేశాల్లో ఈ తరహా సేవలు అందుతున్నాయి.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Bangalore

ఉత్తమ కథలు