Minor Girl: 15 ఏళ్ల కూతురుపై తండ్రి అత్యాచారం.. వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు సిద్ధం.. చివరకు ఆ బాలిక ఏం చేసిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Minor Girl: 15 సంవత్సరాల బాలికపై ఆ తండ్రి పలు మార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం తన తల్లికి తెలిసినా ఏ మాత్రం పట్టించుకోలేదు. అంతే కాకుండా ఆ బాలికకు ఇష్టం లేని పెళ్లి చేసేందుకు కూడా సిద్ధం అయ్యారు. తండ్రి ఫిక్స్ చేసిన పెళ్లికి ఆమె తల్లి కూడా వత్తాసు పలికింది. ఎలాగైనా బలవంతగా పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. దీంతో ఆ బాలిక ఏం చేసిందంటే.. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఆ బాలిక ఇంటి నుంచి పారిపోయి వచ్చి నెల రోజులు. బెంగళూరులోని సంఘమిత్ర రైలులో పోలీసులకు ఆ బాలిక కంటపడింది. ఆమె మొహంలో ఏదో ఆందోళన ఉన్నట్లు పోలీసులు గమనించారు. ఆ 15 ఏళ్ల బాలిక భయం భయంగా చూడటం వాళ్లు గమనించారు. తమ రెగ్యులర్ విధుల్లో భాగంగా రైల్లో చెకింగ్ చేస్తున్న ఆర్పీఎఫ్ సిబ్బందికి ఈ దృశ్యం కనిపించింది. ఆ బాలిక ఏదో ప్రమాదంలో ఉందని గమనించిన పోలీసులు ఆరా తీశారు.. ఆమె చెప్పింది విని వారి కళ్లు చెమర్చాయి. బెంగళూరుకు సమీపంలోని బంగారపేట్ జంక్షన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రైళ్లో ఒంటరిగా కనిపించి తమను సహాయం అడిగిన బాలికను రక్షించిన పోలీసులు ఆమెను విచారించారు. తనది బిహార్ లోని తూర్పు చంపారన్ లోని మోతిహరి ప్రాంతమని ఆ బాలిక పోలీసులకు చెప్పింది. ఇంట్లో తన తండ్రి ఎన్నో సార్లు ఆత్యాచారం చేశాడని.. ఈ విషయం తన తల్లికి తెలిసినా ఏం పట్టించుకోలేదని వాపోయింది. అంతే కాకుండా నాకు తెలియకుండానే వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని నిశ్చయించారని ఆబాలిక విచారణలో తెలిపింది.

    అందుకే తాను అక్కడ నుంచి పారిపోయి బెంగళూరుకు వచ్చానని తెలిపింది. అయితే ఆమె ఇంటి నుంచి పారపోయి వచ్చి నెల రోజులు అయ్యింది. అయితే ఒంటరిగా ఉన్న నేను అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసే ముఠాకు చిక్కాను. వారు నన్ను వారం పాటు ఓ చీకటి గదిలో బంధించినట్లు చెప్పుకొచ్చింది. తనకు మద్యం, మత్తు పదర్థాలు ఇచ్చినట్లు ఆమె చెప్పింది. అయితే నేడు వేరే ప్రాంతానికి రైలులో తరలిస్తుండగా తప్పించుకున్నానని ఆ బాలిక పోలీసులకు విచారణలో భాగంగా చెప్పుకొచ్చింది.

    ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి కొన్ని పరీక్షలు చేయించిన పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ హోమ్‌కు తరలించారు. ఆ బాలిక తల్లిదండ్రులపై పోస్కో చట్టం ప్రకారం చర్యలు తీసుంటామని పోలీస్ అధికారి చెప్పారు. అలాగే సదరు ముఠా గురించి తీవ్రంగా గాలింపులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఆ బాలికకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ హోమ్‌ నిర్వాహకులకు పోలీసులు సూచించారు.
    Published by:Veera Babu
    First published: