బెంగుళూరులో విషాదకర ఘటన. బెంగుళూరు-కడప రహదారిపై చింతామణి సమీపంలోని నందిగానిపల్లె గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రయాణికులతో వెళ్తున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొట్టింది. దీంతో జీపులోని ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన చికబల్లాపూర్ జిల్లాలోని చింతామణి తాలూకా మరినాయకనహళ్లి దగ్గర జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న కంచర్లహళ్లి పోలీసులుక్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. పదిహేను రోజుల క్రితం కూండా బెంగళూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. హైవేపై ప్రయాణిస్తున్న కాస్లీరు ఓ కరెంట్ పోల్‌కు ఢీ కొట్టడడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్‌లో చనిపోయారు. ఈ సంఘటన అర్థరాత్రి రెండు గంటల తర్వాత జరిగినట్టు పోలీసులు తెలిపారు. కర్ణాటక బెంగళూరులోని కోరమంగళ లోని ఓ కన్వేషన్ సెంటర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం రహదారిలోని ఓ కరెంట్ పోల్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారులో మంటలు చేలరేగాయి.
దీంతో కారు పూర్తిగా దగ్ధం అయింది.కాగా ఈ ప్రమాదంలో తమిళనాడులోని హోసూరు ఎమ్మెల్యే ప్రకాశ్ కొడుకుతోపాటు కోడలు కూడా మృతుల్లో ఉన్నారు. కాగా ఈ ప్రమాదంలో తమిళనాడులోని హోసూరు ఎమ్మెల్యే ప్రకాశ్ కొడుకుతోపాటు కోడలు కూడా మృతుల్లో ఉన్నారు.
కాగా ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ఆరుగురు మృత్యువాత పడగా మరోకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. అయితే కారులో ప్రయాణిస్తున్న వారిలో ఎవరు కూడా సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో పాటు ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బెలున్స్ తెరుచుకోకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.
కాగా మృతుల అందరు కూడా 25 నుండి 30 సంవత్సరాల లోపు వారేనని తెలిపారు. ఈ రెండు ఘటనలతో స్థానిక ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. రెండు ఘటనల్లో దాదాపు 14 మంది చనిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనం నడిపే సమయంలో జాగ్రత్తగా నడపాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితిల్లో మద్యం సేవించి వాహనాన్ని డ్రైవ్ చేయకూడదని ప్రజలకు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Road accident