దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో 19 మంది ఉగ్రవాదులు ప్రవేశించారని తనకు తెలిసిందంటూ... మాజీ జవాను సుందర మూర్తి కర్ణాటక పోలీసులకు కాల్ చెయ్యడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ లేని అలజడి రేగింది. అన్ని రాష్ట్రాల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. పోలీసుల నిఘా పెరిగింది. పెద్ద ఎత్తున తనిఖీలు మొదలుపెట్టారు. తీరా చూస్తే... 65 ఏళ్ల సుందర మూర్తి అబద్ధం చెప్పాడనీ, అసలు ఏ ఉగ్రవాదులూ ఇండియాలోకి రాలేదని తేలింది. ప్రస్తుతం లారీ డ్రైవర్గా పనిచేస్తున్న అతన్ని బెంగళూరు శివార్లలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించగా... తాను ఊహించి అలా చెప్పానన్నాడు. శ్రీలంకలో బాంబు దాడులు చేస్తున్న ఉగ్రవాదులు... నెక్ట్స్ టార్గెట్గా సౌత్ ఇండియాను ఎంచుకునే అవకాశం ఉందని భావించి,... పోలీసులకు కాల్ చేసి అలా చెప్పానన్నాడు. ఇలా ఫేక్ కాల్ చేసినందుకు సుందరమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. సుందర మూర్తి కొడుకు కూడా ఆర్మీ జవానే. కార్గిల్ యుద్ధంలో అమరుడయ్యాడు.

అలర్ట్ హెచ్చరికలు జారీ
సుందర మూర్తి కాల్ హెచ్చరికలతో... ఎందుకైనా మంచిదని... శుక్రవారం రాత్రి కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి పోలీసులకు హెచ్చరికలు వెళ్లాయి. ముందుగా బెంగళూరు, మైసూరు నగరాల్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారని తెలిపింది. అక్కడ హైఅలర్ట్ ప్రకటించారు. అన్ని వాహనాల్నీ తనిఖీ చేశారు. హోటళ్లలో దిగిన వ్యక్తుల సమాచారం సేకరించారు. ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్, రద్దీ ప్రదేశాల్లో అంతటా అలర్ట్ కొనసాగింది.
శ్రీలంకలో వరస పేలుళ్ల తర్వాత ఉగ్రవాదులు దక్షిణాది రాష్ట్రాలని టార్గెట్ చేసుకున్నారనీ.... రైల్వేస్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో నిఘాను పెంచాలనీ ఆయా రాష్ట్రాల డీజీపీలను ఐబీ ఆదేశించింది. దాంతో అన్ని రాష్ట్రాలూ అలర్ట్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తరచూ హైదరాబాద్లో ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో అలర్ట్ కొనసాగింది. ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేశారు. తీరా అది ఫేక్ కాల్ అని తెలియడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి :
బూత్ లెవెల్లో టీడీపీ సర్వే... పూర్తి వివరాలు కోరిన చంద్రబాబు... గెలుపు లెక్కలు తేల్చేందుకు...
నేడు హైదరాబాద్కి జగన్... పార్టీ నేతలతో కీలక సమావేశం... ఎన్నికల ఫలితాలపై చర్చ
నేడు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం... సాదాసీదాగా వేడుకలు
ఉత్తరాంధ్రలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ... ప్రభావం చూపిస్తున్న జనసేన...