హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

School Girl: పాఠశాలకు వెళ్తున్న బాలికను కారులో ఎక్కించుకున్నారు.. చివరకు నిర్మాణుష్యప్రాంతానికి తీసుకెళ్లి..

School Girl: పాఠశాలకు వెళ్తున్న బాలికను కారులో ఎక్కించుకున్నారు.. చివరకు నిర్మాణుష్యప్రాంతానికి తీసుకెళ్లి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

School Girl: కర్ణాటకలో దారుణ ఘటన వెలుగుచూసింది. మైనర్ బాలికను కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ బాలికను మరో ప్రదేశంలో వదిలేశారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై హత్యలు, ఆత్మహత్యలు ఆగడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు. ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. మైనర్ బాలికను కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

యువతిని ప్రేమించాడన్న కోపంతో.. పెద్ద పెద్ద కర్రలతో పశువును బాదినట్లు బాదారు.. ట్విట్టర్ లో వీడియో వైరల్..


దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వాల్ తాలూకాలోని అమతడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమతడి గ్రామానికి చెందిన ఓ బాలిక పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తోంది. తెలిసిన వ్యక్తి స్కూల్ వద్ద డ్రాప్ చేస్తా అని కారులో ఎక్కించుకున్నాడు. అతడు ఆ పాఠశాల వద్ద దించకుండా నేరుగా నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అందులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. అప్పటికే ఆ బాలిక అరుస్తుండగా.. నోటిని గట్టిగా పట్టుకున్నారు. ఆ బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం ఆ బాలికను బ్రహ్మరకూట్లలో వదిలివెళ్లారు. అక్కడ నుంచి బాలికి వాళ్ల ఇంటికి చేరుకుంది. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లు బంట్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసి.. మంగుళూరులోని మహిళా గోస్చెన్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా ప్రదేశంలోని సీసీ కెమెరాలో రికార్టు అయిన ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి అందులో ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. నిందితులపై ఐపీసీ మరియు పోక్సో చట్టం కింద గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మహిళా సంఘాల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.

‘దాక్కో దాక్కో మేక.. దొంగొచ్చి పడతాడు పీక’.. అవును.. గుట్టుచప్పుడు కాకుండా వాళ్లు ఎలా దొంగతనం చేస్తున్నారో చూడండి..


నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మన దేశంలో మానవ మృగాల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేదు.. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు, అత్యాచారాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి.

First published:

Tags: Crime news

ఉత్తమ కథలు