మందుబాబులకు మెట్రో రైలు న్యూఇయర్ గిఫ్ట్...ఏంటో తెలిస్తే షాకే...

మెట్రో స్టేషన్లలో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మందుబాబులపై అమలు చేస్తోన్న ఆంక్షలను కొత్త సంవత్సరం సందర్భంగా సడలించినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ రోజు బ్రీత్ అనలైజర్ టెస్టును మినహాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: December 28, 2019, 8:39 PM IST
మందుబాబులకు మెట్రో రైలు న్యూఇయర్ గిఫ్ట్...ఏంటో తెలిస్తే షాకే...
(ఫైల్ చిత్రం)
  • Share this:
న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులకు మెట్రో రైలు యాజమాన్యం ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ అందజేయనుంది. న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని జనవరి 1 అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీస్‌లను ప్రజలకు అందుబాటు ఉంచనున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. అన్ని మెట్రో స్టేషన్లలో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మందుబాబులపై అమలు చేస్తోన్న ఆంక్షలను కొత్త సంవత్సరం సందర్భంగా సడలించినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ రోజు బ్రీత్ అనలైజర్ టెస్టును మినహాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ మినహాయింపు హైదరాబాద్ మెట్రోలో అనుకుంటే పప్పులో కాలేసినట్లే...బెంగుళూరు మెట్రో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే క్రిస్మస్ సందర్భంగా మందుబాబులకు మెట్రో అధికారులు నో ఎంట్రీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పలు విమర్శలు తలెత్తాయి.

First published: December 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు