బెంగళూరులో పనిచేస్తున్న ఆంధ్ర యువతి.. ప్రతి రోజులాగే ఉద్యోగానికి బయలుదేరింది.. కానీ ఇంతలోనే..

హత్యకు గురైన యువతి..

వారిద్దరు ఒకే షాపులో పనిచేస్తున్నారు. ఇద్దరు మధ్య స్నేహం చిగురించి.. ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య చనువు బాగా పెరిగింది.

  • Share this:
    వారిద్దరు ఒకే షాపులో పనిచేస్తున్నారు. ఇద్దరు మధ్య స్నేహం చిగురించి.. ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య చనువు బాగా పెరిగింది. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు యువతి హత్యకు దారితీశాయి. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని బెంగళూరు(Bengaluru)లో చోటుచేసుకుంది. బాధితురాలిని 23 ఏళ్ల అనితగా గుర్తించారు. వివరాలు.. 23 ఏళ్ల అనిత, 27 ఏళ్ల వెంకటేశ్ ఇద్దరూ కలిసి ఒక ప్రైవేట్ మెడికల్ షాపులో పనిచేశారు. అయితే వీరిద్దరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ అని సమాచారం. మూడేళ్లుగా ఒకే కంపెనీలోనే పనిచేస్తున్న వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వీరు సన్నిహితంగా మెలగడం ప్రారంభించారు.

    అయితే అనిత తల్లిదండ్రులు చిన్న వయసులోనే ఆమెకు బంధువులలో ఒకరితో పెళ్లి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని కూడా అనిత్.. వెకంటేశ్‌కు చెప్పింది. మరోవైపు వెంకటేశ్ మూడు నెలల క్రితం అదే బిల్డింగ్‌లోని వేరే కంపెనీకి మారాడు. ఇక, అనిత, వెంకటేశ్ సన్నిహితులని ఆమె తండ్రికి తెలిసింది. అయితే అనిత తండ్రి దీనిని వ్యతిరేకించాడు. దీంతో ఆమె వెంకటేశ్‌కు దూరంగా ఉండసాగింది. ఈ క్రమంలోనే వెంకటేశ్ తనను పెళ్లి చేసుకోవాలని అనితపై ఒత్తిడి తెచ్చారు.

    ఇక, సోమవారం ఉదయం పూట ఉద్యోగానికి వెళ్తున్న అనితను వెంకటేశ్ కలిశాడు. ఈ క్రమంలోనే వారిద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. వారి మధ్య పెళ్లి గురించి ప్రస్తావన వచ్చిందని.. అనిత నో చెప్పడంతో వెంకటేశ్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఇది గమనించిన అక్కడున్నవారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె మరణించింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అదుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. వివరాలు సేకరించారు. నిందితుడు వెంకటేశ్‌ను అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు వెంకటేశ్.. వారి మధ్య ఉన్న బంధం గురించి, హత్య చేయడానికి గల కారణాలను వెల్లడించినట్టుగా సమాచారం.

    డీసీపీ సంజీవ్ ఎం పాటిల్(Sanjeev M Patil) మాట్లాడుతూ.. వెంకటేశ్‌ను అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. హత్య జరిగిన ప్రదేశం నుంచి ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగిందన్నారు. ఇద్దరు తెలిసిన వ్యక్తులేనని చెప్పారు.

    మొబైల్ విషయంలో అత్తాకోడళ్ల మధ్య గొడవ.. అయ్యో ఎంత ఘోరం జరిగిందంటే..

    మరోవైపు పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అనితకు ఇదివరకే పెళ్లి జరిగిన విషయాలతో, ఇతర వివరాలను కూడా సేకరిస్తున్నారు. మరోవైపు అనిత, వెంకటేశ్‌లతో కలిసి పనిచేసిన వారి నుంచి కూడా పోలీసులు వివరాలు సేకరించే అవకాశం ఉంది. ఇక, ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది.
    Published by:Sumanth Kanukula
    First published: