Home /News /national /

BENGALURU MAN DRESSES AS ZOMATO EXECUTIVE DELIVERS PASTRIES TO START UPS ALONG WITH HIS CV GH SK

Creative Resume: ఫుడ్‌ బాక్స్‌లో రెజ్యూమ్.. ప్రతి ఆఫీస్‌కూ డెలివరీ.. మంచి ఉద్యోగం కోసం నిరుద్యోగి కష్టాలు

అమన్ ఖండేల్‌వాల్

అమన్ ఖండేల్‌వాల్

Zomato executive delivers pastries to start-ups along with his CV: ఒక నిరుద్యోగి ఉద్యోగం సంపాదించేందుకు ఓ వినూత్న ఆలోచన చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు. సీవీ డస్ట్ బిన్ (Dustbin) పాలవకుండా, కంపెనీల యాజమాన్యాలు తప్పకుండా పరిశీలించేలా అతడు ప్లాన్ చేశాడు.

ఇంకా చదవండి ...
ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు ప్రైవేటు ఉద్యోగాలైనా సరే సంపాదించడం అసాధ్యంగా మారింది. కంపెనీలు కుప్పలుతెప్పలుగా వస్తున్న రెజ్యూమ్‌ (Resumes)లను ఏ మాత్రం ఆలోచించకుండా డస్ట్ బిన్స్‌లో పడేస్తున్నాయి. దీంతో ఉద్యోగాలకు అప్లై చేసిన నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. అయితే అమన్ ఖండేల్‌వాల్ అనే ఒక నిరుద్యోగి ఉద్యోగం సంపాదించేందుకు ఓ వినూత్న ఆలోచన చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు. సీవీ డస్ట్ బిన్ (Dustbin) పాలవకుండా, కంపెనీల యాజమాన్యాలు తప్పకుండా పరిశీలించేలా అతడు ప్లాన్ చేశాడు. సదరు నిరుద్యోగి జొమాటో (Zomato) ఎగ్జిక్యూటివ్‌గా మారి ఒక పేస్ట్రీ బాక్స్‌లో స్వీట్స్‌తో సహా రెజ్యూమ్‌ను కంపెనీలకు సెండ్ చేస్తున్నారు.

వావ్.. అచ్చం సినిమాలో మాదిరిగా ఛేజింగ్.. కోర్టు ఆవరణలోనే అటాక్.. వైరల్ వీడియో

"దాదాపు అన్ని రెజ్యూమ్‌లు డస్ట్ బిన్ పాలవుతాయి. కానీ నా రెజ్యూమ్ మాత్రం మీ కడుపులోకి చేరుతుంది." అని రాసిన ఓ పేపర్‌ను ఈ నిరుద్యోగి బాక్స్‌పై అంటించి పంపిస్తున్నాడు. ఈ విషయాన్ని తాజాగా తానే ఓ ట్విట్టర్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. ఇది చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. "ఇది మామూలు క్రియేటివిటీ కాదు భయ్యా, నీ ఐడియా సూపర్!" అంటూ కామెంట్ చేస్తున్నారు.



ప్రస్తుతం అమన్ ఖండేల్‌వాల్ ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీలో మేనేజ్‌మెంట్ ట్రైనీ లేదా అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజర్ ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే విపరీతమైన పోటీ ఉండటంతో తన రెజ్యూమ్‌ను కంపెనీలు పరిగణలోకి తీసుకునే ఛాన్సెస్ దాదాపు శూన్యం అని గ్రహించాడు. అందుకే ఓ క్రియేటివ్ ఆలోచన చేశాడు. తన సీవీ కంపెనీల దృష్టికి స్పష్టంగా వచ్చేలా దాన్ని కేక్స్‌తో ఒక పేస్ట్రీ బాక్స్‌లో పెట్టి మరీ అందజేస్తున్నాడు. అంతేకాదు, దీన్ని అందించేటప్పుడు జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లా డ్రెస్ ధరిస్తున్నాడు. "జొమాటో డెలివరీ బాయ్‌గా దుస్తులు ధరించి, పేస్ట్రీ బాక్స్‌లో నా రెజ్యూమ్‌ని డెలివరీ చేశాను. బెంగళూరులోని స్టార్టప్‌ కంపెనీలకు దీన్ని డెలివరీ చేశాను." అని అమన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

ఏడాది పాటు ట్యూషన్..మాథ్స్ లో కొడుకు స్కోర్ చూసి గుక్క పెట్టి ఏడ్చిన తండ్రి.. వైరల్ వీడియో



అయితే ఈ విషయంపై జొమాటో కంపెనీని కూడా ఆశ్చర్యపరిచింది. హయ్, అమన్ నీ ఐడియా సూపర్.. ఎగ్జిక్యూషన్ వేరే లెవెల్.. వేషధారణ మాత్రం ఏం బాగోలేదు.. కానీ ఈ సీవీ వల్ల నీకు మంచి జాబ్ వచ్చిందని ఆశిస్తున్నామని జొమాటో పేర్కొంది. అయితే కొందరు నెటిజన్లు అమన్‌ను తెగ పొగిడేస్తున్నారు. మరికొందరు మాత్రం జొమాటో డెలివరీ బాయ్ గా అవతారం ఎత్తడం ఏంటి భయ్యా ఇది నైతికం కాదు, ఇది సరదాగా అసలు అనిపించడం లేదని కామెంట్లు చేస్తున్నారు. అయితే కొందరు తమకే కంపెనీ ఉంటే ఈ స్మార్ట్ యువకుడికి ఇప్పటికే ఉద్యోగం ఇచ్చేసే వాళ్లమని రిప్లై ఇస్తున్నారు. ఇలాంటి ఆలోచన అమెరికన్స్ చేశారని వారిని కాపీ చేయడంలో ప్రత్యేకత ఏముందని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఈ పోస్టు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: JOBS, Resume, Trending, Zomato

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు