Home /News /national /

BENGALURU KARNATAKA MARRIED SISTERS DIES 17 DAYS APART IN HUSBANDS HOUSES SU

తీవ్ర విషాదం.. 17 రోజుల వ్యవధిలో అత్తారిళ్లలో మృతిచెందిన అక్కాచెల్లెళ్లు.. అసలేం జరిగిందంటే..

మృతిచెందిన సౌందర్య, ఐశ్వర్య

మృతిచెందిన సౌందర్య, ఐశ్వర్య

ఓ పేద కూలి ఇద్దరు కూతుళ్లు 17 రోజుల వ్యవధిలో మృతిచెందారు. పెళ్లిళ్లు చేసుకున్న ఇద్దరు కూతుళ్లు.. ఇలా అత్తారిళ్లలో మృతి చెందడం ఆ తల్లిదండ్రులకు తీరని వేదనను మిగిల్చింది.

    ఓ పేద కూలి ఇద్దరు కూతుళ్లు 17 రోజుల వ్యవధిలో మృతిచెందారు. తొలుత ఓ కూతురు అత్తారింట్లో ఆత్మహత్య చేసుకోగా, అది జరిగిన రెండు వారాలకే మరో కూతురు అత్తారింట్లో అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఈ రెండు ఘటనలో ఆ కూలి కుటంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. అయితే తన బిడ్డలు మరణాలకు వారి భర్తలు, అత్త-మామల వేధింపులే కారణమని ఆ కూలి ఆరోపించారు. ఈ విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాలు.. హసన్ జిల్లా సక్లేశ్‌పూర్‌లోని బెలగోడు గ్రామానికి చెందిన ఉదయ్.. కాఫీ తోటలలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతనికి నలుగురు కూతుళ్లు. అతని పెద్ద కుమార్తె సౌందర్య.. జర్నలిజంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. అయితే తన కాళ్ల మీద తాను నిలబడాలనే ఉద్దేశంతో పెళ్లికి నిరాకరించింది.

    దీంతో ఉదయ్.. రెండో కూతురు ఐశ్వర్యకు పెళ్లి చేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలోనే గతేడాది తుమ్కూర్ జిల్లాలోని కునిగల్ తాలుకాలోని కావేరిపురంలో నివసిస్తున్న నాగరాజు‌తో ఐశ్వర్య వివాహం జరిపించాడు. నాగరాజు పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. ఈ జంట ప్రస్తుతం తుమ్కూరులోని సరస్వతిపురంలో నివసిస్తున్నారు. మరోవైపు ఉదయ్.. మిగతా ఇద్దరు పిల్లల్లో ఒకరు పీయూసీ, మరోకరు ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదువుతున్నారు.

    ఇక, తొలుత పెళ్లి చేసుకోనని చెప్పిన.. సౌందర్య ఫేస్‌బుక్‌లో ఉమేష్‌తో పరిచయం పెంచుకుంది. ఉమేష్‌ను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. అయితే ఉమేష్‌ది వేరే కులం కావడంతో తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. అయినప్పటికీ.. సౌందర్య, ఉమేష్‌ను గతేడాది నవంబర్‌లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్త ఇంట్లోనే ఉండిపోయింది.

    ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ 8వ తేదీన ఐశ్వర్య.. తన భర్త ఇంట్లోనే ఉరివేసుకుని కనిపించింది. దీంతో ఉదయ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అత్తింటివారు కట్నం కోసం వేధించడం వల్లే తన కూతురు చనిపోయిందని.. ఐశ్వర్య తల్లిదండ్రులు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన 17 రోజులకు అంటే జూన్ 25వ తేదీన ఉదయ్ పెద్ద కూతురు సౌందర్య.. భర్త ఇంట్లో అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. ఈ వార్త తెలిసిన ఉదయ్ దంపతులు కుప్పకూలిపోయారు. ఒకే నెలలో ఇద్దరు కూతుళ్ల మరణించడంతో.. ఉదయ్ కుటుంబం తీవ్ర విషాదంలో కురుకుపోయింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Karnataka, Suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు