Home /News /national /

BENGALURU KARNATAKA LAUNCHES FIRST EVER DIGITAL WATER DATA BANK HERE S ALL YOU NEED TO KNOW GH VB

Digital Water Data Bank: వాటర్ మేనేజ్‌మెంట్ కోసం కొత్త పద్ధతి.. ప్రారంభించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ వాటర్ డేటా బ్యాంకు‘AQVERIUM’ (అక్వేరియం)ను కర్నాటక ఐటీ మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ బెంగళూరులో లాంచ్ చేశారు. దీన్ని అక్వాక్రాఫ్ట్ గ్రూప్ వెంచర్ డెవలప్ చేసింది.

వాతావరణ మార్పులతో మానవాళి ఎదుర్కోబోతున్న అతిపెద్ద సమస్యల్లో నీటి లభ్యత, నీటి కాలుష్యం ప్రధానమైంది. ఏటేటా వర్షపాతం తగ్గుముఖం పడుతుండటంతో నదులు(Rivers) అడుగంటిపోతున్నాయి. మరోపక్క ఉన్న నీటి వనరులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో తాగడానికి చుక్క మంచినీరు దొరకడం గగనమైయ్యే పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని మెరుగైన నీటి నిర్వహణ కోసం కర్ణాటక(Karnataka) ప్రభుత్వం(Government) ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ వాటర్ డేటా బ్యాంకు‘AQVERIUM’ (అక్వేరియం)ను కర్నాటక ఐటీ మంత్రి(Minister) సీఎన్ అశ్వత్ నారాయణ బెంగళూరులో లాంచ్ చేశారు. దీన్ని అక్వాక్రాఫ్ట్ గ్రూప్ వెంచర్ డెవలప్ చేసింది. నీటి నిర్వహణ వ్యవస్థను మెరుగుపర్చడమే డిజిటల్ వాటర్ డేటా బ్యాంకు లక్ష్యమని..త్వరలో ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతుందని నిర్వాహకులు తెలిపారు.

Ear Piercing Ceremony: చెవులు కుట్టే వేడుకకు హాజరైన ‘చనిపోయిన అన్న’..! అస్సలు ఏం జరిగిందంటే..


డిజిటల్ వాటర్ డేటా బ్యాంకు అంటే..?
అన్ని సంస్థలు నీటిని వినియోగిస్తాయి. దీంతో వినియోగానికి సంబంధించిన క్యూరేట్ జాబితాను డిజిటల్ వాటర్ డేటా బ్యాంకు రూపొందిస్తుంది. దీని ద్వారా నీటి వినియోగాన్ని మెరుగుపర్చడంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించవచ్చు. నీటి కాలుష్యంపై పరిశోధనలు, విశ్లేషణలు చేసి అందుకు సంబంధించిన కారణాలు, ఎవిడెన్స్‌ను రూపొందిస్తుంది డిజిటల్ వాటర్ డేటా బ్యాంకు. దీంతో ఈ సమస్య పరిష్కారానికి ఓ మార్గం తెలుసుకునే అవకాశం ఉంది.

వాటర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి స్పష్టమైన విధానం రూపొందించడానికి... అందుకు అవసరమైన ఎవిడెన్స్ ఉపయోగించుకోవడానికి వాటర్ డేటా ఉపయోగపడుతుంది. దీంతో ప్రపంచాన్ని సురక్షితమైన నీటి వనరు ఉన్న ప్రదేశంగా మార్చడానికి అవకాశం ఉంటుంది. అలాగే డేటా ఆధారంగా వాటర్ సర్వీస్ మెకానిజమ్‌ను మెరుగుపర్చుకోవచ్చు. నీటి ఉత్పాదకతను స్థిరంగా పెంచుకోవచ్చు.

అక్వేరియం ప్రారంభం సందర్భంగా మంత్రి నారాయణ్ మాట్లాడుతూ...సమాచార సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకతతో పాటు స్థిరమైన హరిత సాంకేతికతలను మిళితం చేసే ఏకైక ఆవిష్కరణ డిజిటల్ వాటర్ డేటా బ్యాంకు అని అన్నారు. దేశంతో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాలను పరిష్కారాలు కనుగొనే దిశగా స్టార్టప్‌లు సమగ్రంగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడంలో స్వచ్చమైన నీరు, నీటి సంరక్షణ వంటి అంశాలు కీలక పాత్ర వహిస్తాయన్నారు. దేశంలో నీటి, పారిశుద్ధ్య వ్యవస్థ 297 బిలియన్ డాలర్లతో అతి పెద్ద అసంఘటిత రంగంగా మారిందని. దీనికోసం సమయం కేటాయించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇందు కోసం సమగ్రమైన 360డిగ్రీల విధానం అవసరమని మంత్రి నారాయణ్ అభిప్రాయపడ్డారు.

Viral News: పాల ప్యాకెట్‌పై 'IIM Alumni' ట్యాగ్... దీని ఉద్దేశం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్ల చర్చ

ఆక్వాక్రాఫ్ట్ గ్రూప్ వెంచర్స్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ సుబ్రహ్మణ్య కుస్నూర్ మాట్లాడుతూ... సరికొత్త ఆవిష్కరణలు, సోషల్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ కోసం AQVERIUM చొరవ చూపుతుందన్నారు. అలాగే నీరు, పారిశుధ్యం, హైడ్రో-జియోలాజికల్ సైన్సెస్, డేటా సైన్స్‌లలో 10 లక్షల మంది యువతకు శిక్షణ పొందే అవకాశం ఉందన్నారు. 2030 నాటికి భారతదేశాన్ని ‘వాటర్‌ పాజిటివ్‌’గా మార్చాలనే లక్ష్యంతో ‘వాటర్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌’ని సృష్టించేందుకు కంపెనీ ప్రత్యేకమైన సామాజిక ఫ్రాంఛైజింగ్‌ మోడల్‌ను అందజేస్తోందని ఆయన తెలిపారు.
Published by:Veera Babu
First published:

Tags: Bengaluru, Digital, Karnataka

తదుపరి వార్తలు