Home /News /national /

BENGALURU KARNATAKA HIJAB ROW WHAT YOU NEED TO KNOW GH VB

Hijab Controversy: కర్ణాటకలో ముదురుతున్న హిజాబ్ వివాదం.. అసలు సమస్య ఎక్కడ మొదలైంది..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం అట్టుడుకుతోంది. అక్కడ నడుస్తున్న హిజాబ్ (Hijab) వివాదం కొత్త నిరసనలకు వేదికవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో హిందూ ముస్లిం (hindu muslim) ఘర్షణలు చెలరేగడం ఖాయమని చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం అట్టుడుకుతోంది. అక్కడ నడుస్తున్న హిజాబ్ (Hijab) వివాదం కొత్త నిరసనలకు వేదికవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో హిందూ ముస్లిం (hindu muslim) ఘర్షణలు చెలరేగడం ఖాయమని చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ హిజాబ్ (Hijab) వివాదం (protest) చెలరేగడానికి పెద్ద కారణాలే ఉన్నాయి. మొదట ఒక్క చోట చెలరేగిన ఈ ఘర్షణ ప్రస్తుతం చిలికి చిలికి గాలివానలా మారాయి. మొత్తం ఇండియాలో (india) ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు (holidays) ప్రకటించారంటేనే పరిస్థితి ఎంత వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

కర్ణాటకలో హిజాబ్ (Hijab) వివాదం 2022 సంవత్సరం మొదలు కాగానే ప్రారంభమయింది. హిజాబ్ ధరించి క్లాస్ రూంలకు రానివ్వడం లేదని కర్ణాటకకు (Karnataka) చెందిన ఐదుగురు ముస్లిం విద్యార్థినులు కర్ణాటక హై కోర్టును (high court) ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన పిటిషన్​ను (plea) కోర్టు విచారించేందుకు స్వీకరించింది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జనవరి 1న ఉడిపిలోని ఓ ముస్లిం ప్రీ యూనివర్సిటీ కళాశాలలో కొంత మంద విద్యార్థినులు హిజాబ్ (Hijab) ధరించి క్లాస్​కు హాజరయ్యారు. కానీ క్లాస్ తీసుకుంటున్న టీచర్ వారిని తరగతి గదిలోనికి రానిచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఈ హిజాబ్ (Hijab) ఉద్యమం మొదలైంది. అలా తమను క్లాస్ రూంలోకి రానీయకుండా చేసినందుకు ఆ విద్యార్థినులు హై కోర్టును ఆశ్రయించారు.

TS RTC : కోడిపుంజుకు టికెట్.... ఏం జరిగిందో చెప్పిన ఎండీ సజ్జనార్... కండక్టర్‌పై చర్యలు..

ఈ వివాదం ముదురుతూ వచ్చింది. పోటీగా కొంత మంది హిందూ విద్యార్థులు కాషాయ కండువాలను ధరిస్తూ క్లాసులకు రావడం మొదలు పెట్టారు. హిందూ ముస్లిం విద్యార్థులు పోటాపోటీగా కండువాలు, హిజాబ్ (Hijab) ధరించడం మొదలు పెట్టారు. ఇలా హిజాబ్ (Hijab) ధరించి క్లాస్ రూంకి రావడానికి ప్రిన్సిపల్ రుద్ర గౌడ వారిని అనుమతించలేదని ఆ విద్యార్థినులు ఆరోపించారు. తరగతి గదుల్లో ఏకరూపత ఉండాలని ఇలా చేసినట్లు రుద్రగౌడ తెలిపారు.

శివమొగ్గలో ముస్లింలు హిజాబ్ (Hijab) ధరించి రావడం, హిందువులు కాషాయ కండువాలు ధరించి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ వివాదంతో అక్కడ రాళ్లదాడి జరిగింది. దీంతో శివమొగ్గలో 144 సెక్షన్ విధించారు. జనవరి 19న ఉడిపి కళాశాలలో హిజాబ్ (Hijab) ఘటనపై సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. కానీ అక్కడ కూడా ఎటువంటి పరిష్కారం లభించలేదు.

తేదీల వారీగా ఘర్షణల వివరాలు
హిజాబ్ ఘటనలపై జనవరి 26న కర్ణాటక (Karnataka) గవర్నమెంట్ ఒక కమిటీని వేసింది. జనవరి 31న హిజాబ్ ఘటనలపై కర్ణాటక హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫిబ్రవరి 2న శివమొగ్గ జిల్లాలో మరో హిజాబ్ (Hijab) ఘటన బయటపడింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 4న పలు హిందూ సంఘాలపై ఆరోపణలు వచ్చాయి. ఫిబ్రవరి 5న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్ మినిస్టర్స్​తో మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందువల్ల, తీర్పు వచ్చేంత వరకు అందరూ సంయమనం పాటించాలని సీఎం కోరుతూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
Published by:Veera Babu
First published:

Tags: Hijab, Karnataka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు