హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Surveying churches: చర్చీలపై సర్వేకు ఆదేశించిన కర్ణాటక సర్కార్.., వాటిని కట్టడిచేసేందుకేనా..?

Surveying churches: చర్చీలపై సర్వేకు ఆదేశించిన కర్ణాటక సర్కార్.., వాటిని కట్టడిచేసేందుకేనా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కర్ణాటకలో (Karnataka) చర్చిల వివాదం (Church Controversy) రాజుకుంది.అక్కడ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (Bharatiya Janatha Party) రాష్ట్రంలో చర్చీల గురించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇంకా చదవండి ...

కర్ణాటకలో (Karnataka) చర్చిల వివాదం (Controversy) రాజుకుంది.అక్కడ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (Bharatiya Janatha Party) రాష్ట్రంలో చర్చీల గురించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్) ప్రభుత్వ ఆదేశానికి వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టులో వ్యాజ్యం వేసింది. ఈ విషయంపై విచారించిన కోర్టు కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఫలితంగా ఇరు పక్షాలవారు మాటల తూటాలను పేల్చుకున్నారు. ప్రభుత్వ వైఖరి పట్ల క్రైస్తవ సంఘాలు, మిషనరీలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ మైనార్టీస్ వెల్ఫేర్ చర్చిల డేటా కోసం సర్వే నిర్వహించాలని రాష్ట్రంలో అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లను ఆదేశించింది. దీనికి సంబంధించి జులై 7న ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

అసలు సర్వే దేని గురించి..?

చర్చిలు, వాటి చిరునామా, భౌగోళిక స్థానం, ఖాతా(Landholding), సర్వే నంబర్, ఇంఛార్జ్ ప్రీస్ట్ లేదా పాస్టర్ పేరుకు సంబంధింత డేటాను సేకరించాలని ఈ ప్రకటనలో ఉద్దేశించారు. అంతేకాకుండా క్రిస్టియన్ మిషనరీల బలవంతపు మతమార్పిడులను తనిఖీ చేయడానికి మరో సర్వే అమలపై నిర్ణయం తీసుకోవడానికి కర్ణాటక శాసన సభకు చెందిన హౌస్ కమిటీ అక్టోబరు 13న సమావేశమైంది. ఈ భేటీ ముగిసిన ఓ రోజు తర్వాత అధికారిక, అనధికారిక చర్చిల గురించి సమాచారాన్ని సేకరించడానికి రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ADGP ద్వారా అంతర్గత ఉత్తర్వను జారీ చేశారు. తమ పరిధిలోని చర్చిలు, కమ్యూనిటీ ప్రార్థనా మందిరాలను చెక్ చేయడానికి రాష్ట్రంలోని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(DSP)లందరికీ ఆదేశాలిచ్చారు.

సమస్య రాజకీయంగా మారడానికి కారణం..

ఇటీవల జరిగిన వర్షాకాల సమావేశాల్లో బలవంతపు మతమార్పిడులు రాష్ట్రవ్యాప్తంగా ప్రబలంగా ఉన్నాయని హోసదుర్గ భాజపా ఎమ్మెల్యే గూలిహట్టి శేఖర్ పేర్కొన్నారు. అంతేకాకుండా తన నియోజకవర్గంలో తన సొంత తల్లితో సహా 15 వేల నుంచి 20 వేల మంది క్రైస్తవ మతంలోకి మారారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ మతమార్పుడిలకు సంబంధించిన 36 కేసుల నమోదయ్యయానని, కొంతమంది తమ నివాసాలను బైబిల్ సొసైటీలుగా మారుస్తున్నారని ఆరోపించారు. శేఖర్ ఆరోపణలకు సమాధానంగా ఆ రాష్ట్ర హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర స్పందించారు. ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఒకరిని ప్రేరేపించి మరో మతంలోకి మార్చడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తామని, ఇలాంటి వాటిపై నిఘా ఉంచుతామని ఆయన సమాధానమిచ్చారు.ఓ వారం తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి రాష్ట్రంలో బలవంతపు మతమార్పిడులను నిషేధించడానికి ఓ చట్టాన్ని ప్రవేశపెట్టాలనే ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే హోసదుర్గ ఎమ్మెల్యే శేఖర్.. 20 మంది సభ్యుల హౌస్ కమిటీకి అధ్యక్షత వహించారు. ఈ కమిటీని క్రైస్తవ మిషనరీలపై సర్వేకు ఆదేశించింది. దీంతో క్రైస్తవ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చంది.

కర్ణాటకలో క్రైస్తవ సమాజం ఏమంటోంది..?

ఈ విషయంపై బెంగళూరు ఆర్చ్ బిషప్ రెవరెండ్ పీటర్ మచాడో మొదటి సారిగా స్పందించారు. ఈ చర్యను వ్యతిరేకించారు. బలవంతపు మతమార్పిడులను నిషేధించే ప్రతిపాదిత చట్టంపై ఆందోళనలు చేసేందుకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను కలిసేందుకు రాష్ట్రంలోని క్యాథలిక్ బిషప్ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించారు. ప్రజాప్రతినిధులు ద్వేషపూరితమైన, అవాస్తవమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి చట్టం(మతమార్పుడుల నిషేధిత చట్టం) అనవసరమని స్పష్టం చేశారు.

అక్టోబరు 24న బెంగళూరు ఆర్చ్ డియోసెస్ ముఖ్యమంత్రి రెండో మెమోరెండం రాశారు. వెనుకబడిన తరగతులు, సంక్షేమ శాఖ ఆర్డర్ ను పూర్తిగా ఉపసంహరించుకునే వరకు క్రైస్తవ సమాజం విశ్రమించనది అందులో పేర్కొన్నారు.అనంతరం అక్టోబర్ 25న బెంగుళూరులో ఆల్ కర్ణాటక యునైటెడ్ క్రిస్టియన్స్ ఫోరమ్ ఫర్ హ్యూమన్ రైట్స్ (AKUCFHR) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా, మాజీ హోం మంత్రి కేజే జార్జ్ సహా పలు సీనియర్ రాజకీయ నాయకులు బీజేపీ ప్రభుత్వ చర్యను వ్యతిరేకించారు.

మతమార్పిడి కేసులపై క్రైస్తవ సమాజం స్పందన..

రాష్ట్రంలో 36 బలవంతపు మతమార్పిడులు జరిగాయనే విషయాన్ని చర్చి పరిశీలిస్తోందని మచాడో అన్నారు. ఈ కేసుల్లో చాలా వరకు నిరాధారమైనవని, అయితే వీటిలో వాస్తవికత ఉందో లేదో తెలుసుకోవడానికి తాము ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. క్రైస్తవ సమాజం రాష్ట్ర జనాభాలో కేవలం 1.8 శాతం మాత్రమే ఉందని, మతమార్పిడి నిరోధక బిల్లు కొన్ని పార్టీల రాజకీయ ఎజెండా అని క్యాథలిక్ బిషప్స్ ముఖ్యమంత్రికి సమర్పించిన మెమోరెండంలో పేర్కొన్నారు. చర్చిలు నిర్వహించే అన్ని ఆస్తులపై ప్రభుత్వం వద్ద ఇప్పటికే సమాచారం ఉందని స్పష్టం చేశారు.

సర్వేపై దాఖలైన పిటీషన్ కర్ణాటక హైకోర్టు ఎలా స్పందించింది..?

కొనసాగుతున్న సర్వేపై స్టే విధించేందుకు, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కర్ణాటక హైకోర్టు నికారించినప్పటికీ, PUCL దాఖలు చేసిన పిల్ పై మూడు వారాల్లోగా అభ్యంతరాలను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. "మైనార్టీల సంక్షేమ శాఖ ద్వారా డేటా కోరడమైంది. ఇది వారి సంక్షేమం కోసం కావచ్చు. వారు క్రైస్తవులను ఏ విధంగాంనైనా హింసించబోతున్నారని చూపించడానికి రికార్డుల్లో ఏమి లేదు." అని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్తి, సచిన్ శంకర్ మగదుమ్ తో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. "జూలై 7న (కొనసాగుతున్న సర్వేను ప్రారంభించడానికి) నిర్వహించిన సంక్షేమ కమిటీ సమావేశం ఆధారంగా జారీ చేసిన కమ్యూనికేషన్ చట్టవిరుద్ధం, వివక్షత, ఏకపక్షం రాజ్యాంగ విరుద్ధం. అంతేకాకుండా ఆర్టికల్స్ 14 ప్రకారం సమానత్వం, గోప్యత హక్కును ఉల్లంఘించడం" అని పియుసిఎల్ తన పిటిషన్‌లో పేర్కొంది.

First published:

Tags: Karnataka