హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Lockdown: లాక్‌డౌన్ విధించిన మరో రాష్ట్రం.. ఎన్ని రోజులంటే..

Lockdown: లాక్‌డౌన్ విధించిన మరో రాష్ట్రం.. ఎన్ని రోజులంటే..

ఈనెల 24, 25 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఈనెల 24, 25 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Lockdown In Karnataka: రాష్ట్రంలో కరోనా కర్ఫ్యూ విఫలం కావడం వల్లే లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు కర్ణాటక సీఎం యడియూరప్ప తెలిపారు.

  దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. అలాంటి రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఉంది. కరోనా కట్టడి కోసం ఇప్పటికే లాక్‌డౌన్ తరహా నిబంధనలు అమలు చేస్తున్న కర్ణాటక ప్రభుత్వం.. తాజాగా లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించింది. 14 రోజులపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కర్ఫ్యూ విఫలం కావడం వల్లే లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. రాష్ట్రంలో కరోనా కర్ఫ్యూ విధించినప్పటికీ కొవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. కర్ఫ్యూ విజయవంతం కాకపోవడంతోనే లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

  ఈ నెల 10న ఉదయం 6 గంటలకు మొదలయ్యే లాక్‌డౌన్ 24వ తేదీ వరకు అమల్లో ఉంటుందని యడియూరప్ప తెలిపారు. లాక్‌డౌన్ సందర్భంగా కర్ణాటక వ్యాప్తంగా అన్ని హోటళ్లు, పబ్‌లు, బార్లు మూతపడనున్నాయి. ఈటరీలు, మాంసం, కూరగాయల దుకాణాలు మాత్రం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంటాయి. లాక్‌డౌన్ కాలంలో అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్టు యడియూరప్ప తెలిపారు.

  కర్ణాటకలో కొద్దిరోజుల నుంచి కఠినమైన కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ.. కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజూవారి కొత్త కేసుల సంఖ్య 50 వేల చేరువకు రావడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఇక బెంగళూరులో కేసుల తీవ్రత మరింత ఎక్కువగా నమోదవుతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కట్టడికి లాక్‌డౌన్ మినహా మరో మార్గం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. రెండు వారాల పాటు లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Karnataka, Lockdown

  ఉత్తమ కథలు