నటుడిగానే కాకుండా సామాజిక సేవకుడిగానూ సమాజంపై చెరగని ముద్ర వేశారు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. అభిమానులంతా అప్పు అని పిలుచుకునే ఆయన ఇటీవలే గుండెపోటుతో మరణించడం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సోమవారం నాడు పునీత్ దశదిన కర్మను జరుపుకొన్నారు. ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సైతం బళ్లారిలో జరిగిన కార్యక్రమంలో పునీత్ కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గాలి కీలక ప్రకటలు చేశారు.
అద్భుత నటనతో పాటు సామాజిక సేవతోనూ గుర్తింపు పొందిన తనదైన శైలిలో గుర్తింపు పొందిన పునీత్‌రాజ్‌కుమార్ మరణం యావత్ కన్నడ ప్రజలను దు:ఖంలోకి నెట్టేసిందని, దివంగత నటుడికి ఎన్ని అవార్డులు వచ్చినా తక్కువేనని కర్ణాటక మాజీ మంత్రి గాలిజనార్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన బెళగల్ క్రాస్‌లోని రుక్మిణమ్మ చెంగారెడ్డి వృద్ధాశ్రమంలో పునీత్‌రాజ్‌కుమార్ చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు.
బళ్లారి పట్టణంలో పునీత్‌రాజ్‌కుమార్ పేరుతో ఉచిత ఆస్పత్రి, పాఠశాలను నిర్మిస్తామమని మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఈ నిర్మాణాలను తమ సొంత నిధులతో చేపడతామని, పునీత్ పేరుతో పేదలకు సేవ చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని, వినయ విధేయతలకు పునీత్ మారుపేరుని గాలి అన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇకపై బళ్లారిలోనే ఉంటానని బళ్లారిలోనే ఉంటూ సేవా కార్యక్రమాలను చేపడుతానని గాలిజనార్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. జనార్ధన్ రెడ్డితోపాటు ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి లక్ష్మీ అరుణ, సోదరుడు, ఎమ్మెల్యే గాలిసోమశేఖరెడ్డి, బుడా చైర్మన్ పాలన్న తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గాలిసోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. పునీత్ మరణం తీరనిలోటని, పునీత్‌తో తమకు ఎంతో అవినాభవ సంబంధం ఉందని గుర్తు చేసుకొన్నారు. నగరంలోని రాయల్ బస్టాండ్‌కు పునీత్ పేరు పెడతామని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.