Home /News /national /

BENGALURU IISC LAB LETS MONKEYS PLAY WORK AS SCIENTISTS STUDY GH VB

IISc Bengaluru: మకాక్‌ మంకీస్‌కు ఇల్లు లాంటి సరికొత్త ల్యాబ్‌.. ఐఐఎస్సీ బెంగళూరు పరిశోధనల్లో మెరుగైన ఫలితాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వివిధ పరిశోధనలకు శాస్త్రవేత్తలు మకాక్‌ మంకీస్‌ను వినియోగించడం మామూలే. మానసిక, ఆరోగ్య, వైద్య పరమైన ప్రయోగాలను వాటిపై చేస్తుంటారు. అయితే మకాక్‌ మంకీస్‌పై పరీక్షలు జరపడానికి, పర్యవేక్షణలో ఉంచడానికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌(ఐఐఎస్‌సీ) (Indian Institute Of Science) సరికొత్త మార్గాన్ని ఎంచుకొంది.

ఇంకా చదవండి ...
వివిధ పరిశోధనలకు శాస్త్రవేత్తలుమకాక్‌ మంకీస్‌నువినియోగించడం మామూలే. మానసిక, ఆరోగ్య, వైద్య పరమైన ప్రయోగాలను వాటిపై చేస్తుంటారు. అయితే మకాక్‌ మంకీస్‌పై పరీక్షలు జరపడానికి, పర్యవేక్షణలో ఉంచడానికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌(ఐఐఎస్‌సీ) (Indian Institute Of Science) సరికొత్త మార్గాన్ని ఎంచుకొంది. మకాక్‌ మంకీస్‌ చాలా తెలివైనవి, చాలా అంశాల్లో అవి మానువుడికి సమీపంలో ఉంటాయి. అందుకే వాటిని పరిశోధనలకు ఎక్కువగా వినియోగిస్తారు. అందుకే అవి శాస్ర్తవేత్తలోపాటు పరిశోధనలు జరిగే ల్యాబ్‌లలో ఉంటాయి. ఏదైనా అంశంపై పరీక్షలు జరుగుతున్నప్పుడు మకాక్‌ మంకీస్‌ కళ్ల తీరును(Eye Movements), మెదడు సగ్నల్స్‌ను(Brain Signals) రికార్డు చేస్తారు.

మనుషుల లక్షణాలను పోలి ఉండటంతో శాస్ర్తవేత్తలకు పరిశోధనలు సులువు అవుతాయి. దీనిపై న్యూరోసైన్సెస్ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎస్పీ అరుణ్‌ మాట్లాడుతూ.. ‘సహజంగా ఉండే పరిసరాల్లో పరిశోధన జరపేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకొన్నాం. అప్పుడే మకాక్‌ మంకీస్‌ సహజ స్వభావాలను, ప్రవర్తనలను మెరుగ్గా అర్థం చేసుకోగలం. అందుకే పరిశోధనలు జరిపే ల్యాబ్‌ను మకాక్‌ మంకీస్‌కు ఇల్లులా మార్చాలని నిర్ణయించాం. అవి ఏదో కొత్త ప్రాంతంలో ఉన్నామనేలా కాకుండా మామూలుగా ఉండే వాతావరణం కల్పిస్తున్నాం’ అని చెప్పారు. సరికొత్తగా ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో మంకీస్‌ తిరిగేందుకు చాలా స్థలం ఉంటుంది. చెట్లు, టచ్‌స్రీన్‌ వర్క్‌స్టేషన్‌(Touch Screen Workstation) వంటివి ఉంటాయి.

ALSO READ Ukraine-Russia : ఆ దేశంపై యుద్ధానికి..ఆర్మీలో చేరి శిక్షణ తీసుకుంటున్న 79 ఏళ్ల బామ్మ

మంకీస్‌ కొత్త విషయాలను నేర్చకొనే సమయంలో వాటి మానసిక పరిస్థితిని సంప్రదాయ పద్ధతుల్లో తెలుసుకోవడం కష్టం. ఇల్లు లాంటి వాతావరణంలో కొత్త పద్ధతుల్లో మెరుగైన పరిశోధనలు జరుపవచ్చని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.ఈ ల్యాబ్‌లో అడవిని తలపించేలా రూమ్‌, మంకీస్‌ టాస్క్‌లు చేసేందుకు వీలుగా టచ్‌స్క్రీన్‌తో కూడిన బిహేవియర్‌ రూమ్‌ ఉంటాయి. వాటికి శాస్ర్తవేత్తలు ట్రైనింగ్‌ కూడా ఇచ్చారు. పరిశోధనలు జరిగే సమయంలో మంకీస్‌ వాటంతట అవే చిన్‌రెస్ట్‌పై తల పెట్టి కూర్చుంటాయని ఎలైఫ్‌లో ప్రచురితమైన జర్నల్‌లో ఐఐఎస్‌సీ పేర్కొంది.
ఈ ఇల్లులో జంతువులు ఇష్టపడే వాతావరణం కల్పించడం మాత్రమే కాకుండా, చాలా టెక్నికల్‌ ప్రాబ్లెమ్స్‌ను అరుణ్‌ బృందం పరిష్కరించింది.

అరుణ్‌ మాట్లాడుతూ..‘మంకీస్‌ టాస్క్‌లు చేసేలా టచ్‌ స్క్రీన్‌ వర్క్‌స్టేషన్‌ రూపొందించాం. వాటి కదలికలను నిశితంగా రికార్డు చేయడం రెండో సమస్య. జ్యూస్‌ తాగడానికి మంకీస్‌ ప్రతిసారి వాటి తలను ప్రతిసారి ఒకే పొజిషన్‌కు తీసుకువస్తాయి. వాటి తలను కదల్చకుండా స్థిరంగా ఉండేలా చిన్‌రెస్ట్‌ను ఏర్పాటు చేశాం. ఇలా చేయడం ద్వారా కస్టమ్‌ ఐ ట్రాక్టర్‌ మెరుగ్గా వాటి కంటి కదలికలను రికార్డు చేయగలిగింది.సేమ్‌- డిఫెరెంట్‌ టాస్క్‌లు చేసేలా శాస్ర్తవేత్తలు మంకీస్‌ను ట్రైన్‌ చేశారు. దీని ద్వారా మంకీస్‌ వాటంతట అవే టచ్‌ స్క్రీన్‌కు వస్తుంటాయి. వాటంతటే అవే వెళ్లిపోతాయి.’ అని వివరించారు.

మంకీలకు 21 రోజుల ట్రైనింగ్​..
కష్టమైన టాస్కులు చేసేలా మంకీస్‌కి తర్ఫీదు ఇవ్వాలంటే చాలా నెలలు పడుతుందని అరుణ్‌ చెప్పారు. అసలు ట్రైనింగ్‌ ఇవ్వని మంకీస్‌, అప్పటికే ట్రైనింగ్ పూర్తి చేసుకొన్న వాటిని నుంచి సహజంగా నేర్చుకొంటాయా? లేదా? అని తెలుసుకొనేందుకు ఓ ప్రయోగం చేశామన్నారు. అది విజయవంతమైతే చాలా సమయం, శ్రమ కలిసి వస్తాయని తెలిపారు. కొత్తగా రూపొందించిన సహజసిద్ధంగా కనిపించే ల్యాబ్‌ అందుకు ఉపయోగపడుతుందని భావించామని చెప్పారు.

రెండు ట్రైనింగ్‌ పొందిన మంకీస్‌ వద్దకు, ట్రైన్‌ కాని మంకీని పంపామని, నిజానికి అవి చేస్తున్న టాస్కులను చూసి కొత్తగా చేరిన మంకీ నేర్చుకొందని అరుణ్‌ వివరించారు. ట్రైన్‌ కాని మంకీని ల్యాబ్‌లోకి తీసుకొచ్చిన ఐదు రోజులకు టాస్కులపై దానికి ప్రాథమిక అవగాహన వచ్చిందని, 9వ రోజుకు టాస్కు స్ట్రక్చర్‌ను అర్థం చేసుకొందని, 21వ రోజులు ట్రైనింగ్‌ పొందిన వాటిలానే ప్రవర్తించిందని చెప్పారు.
Published by:Veera Babu
First published:

తదుపరి వార్తలు