Cybersecurity Programme: ఆ విద్యా సంస్థలో సైబర్ సెక్యూరిటీ అడ్వాన్స్‌డ్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం.. NPCI సాయంతో ప్రారంభం..

ప్రతీకాత్మక చిత్రం

Cybersecurity Programme: సైబర్ టెక్నాలజీ కోర్సులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, మరో ప్రముఖ విద్యాసంస్థ ఈ విభాగంలో కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) బెంగుళూరు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సంయుక్తంగా సైబర్ సెక్యూరిటీలో అడ్వాన్స్‌డ్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంను అందిస్తున్నట్లు ప్రకటించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
సైబర్ టెక్నాలజీ కోర్సులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, మరో ప్రముఖ విద్యాసంస్థ ఈ విభాగంలో కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) బెంగుళూరు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సంయుక్తంగా సైబర్ సెక్యూరిటీలో అడ్వాన్స్‌డ్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంను అందిస్తున్నట్లు ప్రకటించాయి. బ్యాంకింగ్, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్ డొమైన్‌లలో పనిచేసే మిడ్-లెవల్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ కోసం ఈ ప్రోగ్రాంను రూపొందించారు. ఈ కోర్సును సింప్లీలెర్న్ (Simplilearn) సంస్థ సహకారంతో అందించనున్నారు.

ఈ ప్రోగ్రాంలో సైబర్ సెక్యూరిటీలో పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలపై దృష్టి సారించే పాఠ్యాంశాలు ఉన్నాయి. అభ్యర్థులకు NPCIలో వర్చువల్ ఇంటర్న్‌షిప్‌తో పాటు ఈ సంస్థకు చెందిన నిపుణులతో 3-4 మెంటరింగ్ సెషన్‌లు కూడా ఉంటాయి. ప్రోగ్రాం పూర్తి చేసిన తర్వాత.. NPCI, సింప్లీలెర్న్ సంయుక్తంగా ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్‌ అందిస్తాయి.

ఇది చదవండి: ఈ స్కీమ్ వాళ్లకు మంచి పెట్టుబడి మార్గం.. పథకం అర్హత, ప్రయోజనాలు ఇవే..

దీంతోపాటు IIIT బెంగళూరు ప్రత్యేకంగా కోర్సు సర్టిఫికెట్‌ అందిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ప్రోగ్రాంలో డేటా ఇంటిగ్రిటీ, డేటా రికవరీ, డిజాస్టర్ రికవరీ, సిస్టమ్స్ ప్లానింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి కీలక డొమైన్లు ఉన్నాయి. నిపుణులు నిర్వహించే లైవ్ వర్చువల్ క్లాసులు, వీడియో క్లాసులు, IIIT బెంగళూరు అధ్యాపకులు, NPCI నిపుణుల మాస్టర్ క్లాసులతో అభ్యర్థులు సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెంచుకోవచ్చు.

ఇది చదవండి: అక్టోబర్​ నుంచి అమల్లోకి నూతన వేతన కోడ్.. వారానికి 3 రోజుల సెలవు.. పనివేళల్లో భారీ మార్పులు..

ఈ ప్రోగ్రాం గ్రాడ్యుయేట్లు సింప్లీలెర్న్ జాబ్ అసిస్టెన్స్ సర్వీస్‌లో నమోదు చేసుకోవచ్చు. దీని సాయంతో సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పెషలిస్ట్‌లు, కన్సల్టెంట్ నెట్‌వర్క్ సెక్యూరిటీ, సెక్యూరిటీ అనలిస్ట్, ఎనలిస్ట్ అప్లికేషన్ సెక్యూరిటీ వంటి ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. సెక్టార్, ఇండస్ట్రీ అనే తేడాలు లేకుండా ప్రతి విభాగానికి సైబర్ నిపుణుల అవసరం ఉందని చెబుతున్నారు సింప్లీలెర్న్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఆనంద్ నారాయణన్.

ఇది చదవండి: వృద్ధురాళ్లపై లైంగిక దాడి.. నిందితుల్లో ఒకరికి 22 ఏళ్లు.. మరొకరికి 32 ఏళ్లు..

సైబర్ దాడులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో, ఈ ప్రోగ్రాంతో నిపుణుల కొరత తీర్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. NPCI వర్చువల్ ఇంటర్న్‌షిప్, డొమైన్‌ నిపుణుల మాస్టర్‌క్లాస్‌లతో పాటు, సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్‌ల గురించి ఈ ప్రోగ్రాంలో నేర్పిస్తామని తెలిపారు. తమ సైబర్ సెక్యూరిటీ కోర్సుతో ఉద్యోగానికి సిద్ధంగా ఉండే వర్క్‌ఫోర్స్‌ను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు ట్రిపుల్ ఐటీ బెంగళూరు ప్రొఫెసర్ శ్రీధర్. అన్ని వ్యాపారాలకు, ముఖ్యంగా సున్నితమైన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల బృందం అవసరం ఉందన్నారు.
Published by:Veera Babu
First published: