హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bengaluru Floods: కోట్ల కార్లున్నా.. ఇప్పుడు ట్రాక్టర్లే దిక్కు.. బెంగళూరులో వరద విలయం దృశ్యాలు

Bengaluru Floods: కోట్ల కార్లున్నా.. ఇప్పుడు ట్రాక్టర్లే దిక్కు.. బెంగళూరులో వరద విలయం దృశ్యాలు

Bengaluru Floods: కోటీశ్వరులంతా.. విల్లాలను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లలేక నరకం చూస్తున్నారు. మొన్నటి వరకు వీరంతా.. ఖరీదైన కార్లు.. లేదంటే మెట్రో రైళ్లలో ప్రయాణించే వారు. కానీ ఇప్పుడందరికీ ట్రాక్టర్లే దిక్కయ్యాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఖరీదైన విల్లాలున్నాయి.. కానీ ఇంట్లో ఉండలేరు. కోట్ల విలువైన కార్లున్నాయి.. కానీ కష్టాల్లో కాపాడలేకపోయాయి. కోట్లల్లో ఆస్తులు.. అకౌంట్‌లో లక్షలున్నా.. తినడానికి తిండి లేదు. తాగడానికి నీరు లేదు. అంతెందుకు.. నిలవడానికి నీడ లేదు. బెంగళూరులోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బెంగళూరు నగరం  (Bengaluru Floods)నీట మునిగింది. నగరంలోని చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మురికి వాడలతో పాటు కోటీశ్వరులుండే విల్లాలు సైతం.. వరద నీటిలో మునిగాయి. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి. అధికారుల చొరవతో కొన్ని ప్రాంతాలు ఇప్పుడిప్పుడే వరద ముంపు నుంచి బయటపడుతుండగా.. ఇంకా కొన్ని ప్రాంతాలు.. నీటిలోనే ఉన్నాయి.

  కోటీశ్వరులంతా.. విల్లాలను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లలేక నరకం చూస్తున్నారు. మొన్నటి వరకు వీరంతా.. ఖరీదైన కార్లు.. లేదంటే మెట్రో రైళ్లలో ప్రయాణించే వారు. కానీ ఇప్పుడందరికీ ట్రాక్టర్లే దిక్కయ్యాయి. పేదోళ్లు, ధనవంతులకు.. అవే ఇప్పుడు ఆధారమయ్యాయి. నీట మునిగిన ప్రాంతాల్లో ట్రాక్టర్లతోనే సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎంతో మంది ఇళ్లను వదిలేసి.. తట్టా బుట్టా సర్దుకొని.. ట్రాక్టర్లలో వెళ్లిపోతున్నారు. బెంగళూరులో వరద బీభత్సాన్ని ఈ వీడియోల్లో చూడండి.

  వరద ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్లతో సహాయక చర్యలు

  ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో నీట మునిగిన కార్లు

  స్విమ్మింగ్ పూల్‌గా మారిన ఓ ఖరీదైన విల్లా

  ట్రాక్టర్‌లో వెళ్తున్న యూఎన్ అకాడీ సీఈవో గౌరవ్ ముంజాల్ ఫ్యామిలీ

  ట్రాక్టర్‌లో ఆఫీసులకు వెళ్తున్న ఐటీ ఉద్యోగులు

  బెల్లందూరులో నదిని తలపిస్తున్న రహదారి

  బెల్లందూరు చెరువు నుంచి కాలనీల్లో ప్రవహిస్తున్న వరద నీరు

  బెంగళూరులోని బెల్లందూరు చెరువుతో పాటు ఎన్నో చెరువులను కబ్జా చేసి.. నిర్మాణాలు చేపట్టడం వల్లే నగరానికి ఈ దుస్థితి వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చెరువు కుచించుకుపోవడం వల్లే.. వరద నీరంతా కాలనీల్లోకి వచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు. చెరువుల, కాల్వలను ఆక్రమించి.. అక్రమ నిర్మాణాలను చేపట్టిన వారిపై.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bengaluru, Karnataka, WEATHER, Weather report

  ఉత్తమ కథలు