హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bengalor :అమానుషం : డ్రైవర్‌ను కోట్టి చంపిన ఆర్టీసీ ఉద్యోగుల అరెస్ట్...

Bengalor :అమానుషం : డ్రైవర్‌ను కోట్టి చంపిన ఆర్టీసీ ఉద్యోగుల అరెస్ట్...

FILE PHOTO

FILE PHOTO

Bengalor తోటి ఉద్యోగినే తమకు వ్యతిరేకంగా ఉన్నాడని కొట్టారు..దీంతో ఆ ఉద్యోగి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందిన సంఘటనలో , సంఘటనకు భాద్యులైన అయిదుగురు డ్రైవర్లను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆర్టీసీ సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరైన డ్రైవర్‌ కే. అవటిపై దాడికి పాల్పడ్డ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ మృత దేహంపై గాయాలు ఉండటంతో.. రాళ్లతో దాడి చేసినట్టు గుర్తించారు. రాళ్లతో కొట్టడడం వల్లే డ్రైవర్ చనిపోయాడని నిర్ణారణకు వచ్చారు. కాగా మృతి చెందిన డ్రైవర్‌కు భార్య, నలుగురు కుమారులున్నారని అధికారులు వెల్లడించారు. మృతుని కుటుంబానికి రూ.30 లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తామని అధికారులు వెల్లడించారు.

ఓ వైపు కరోనాతో ప్రజలు సతమతవుతుంటే..మరోవైపు కర్ణాటక ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం తమ పంతం నెగ్గించుకుంటున్నారు. ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవాల్సిన ఉద్యోగులు వారిని మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ పంతం నెగ్గించుకునేందుకు ఏకంగా తమ సంస్థ ఉద్యోగినే కోట్టి చంపిన ఘటన కలకలం రేపింది.

కర్ణాటకలో ఆర్టీసీ సమ్మె గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే... దీంతో ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో హజరు కావడం లేదు. మరోవైపు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే కొంతమంది ఉద్యోగులను విధుల్లో చేరాలని విజ్ఝప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కర్ణాటక లోని బాగల్‌కోటే జిల్లా,జమల్ ఖండి ఆర్టీసీ డిపోకు చెందిన 46 ఏళ్ల అవటి అనే డ్రైవర్ విధుల్లో చేరాడు. బస్సును తీసి నడిపేందుకు ప్రయత్నం చేశాడు.

ప్రభుత్వ ప్రయత్నాలతో ఆగ్రహానికి గురైన ఇతర ఉద్యోగులు విధుల్లో చేరిన ఉద్యోగిపై దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా బస్సునుండి క్రిందకు లాగారు. దీంతో కిందపడ్డ డ్రైవర్ అవటి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం ఉద్యోగి మృతిచెందాడు. కార్మికుల దాడిలో మృతిచెందిన కే అవటి గతంలో ముఖ్యమంత్రి బంగారుపతకం కూడా అందకున్నారని, ఒక్క ప్రమాదం కూడా లేకుండా సర్వీసులో బస్సులను నడిపారని అధికారులు వివరించారు.

First published:

Tags: Bengaluru, Karnataka, RTC Strike

ఉత్తమ కథలు