Sad: తలుపులు బద్దలు కొట్టి చూస్తే షాకింగ్ సీన్.. ఇంట్లో ఐదుగురి మృతదేహాలు.. పాపం ఆ మూడేళ్ల చిన్నారి..

ఈ ఫొటోలోని చిన్నారి. ఆ పాపను పట్టుకున్న ఆమె తాత శంకర్ మాత్రమే ఇప్పుడు బతికి ఉన్నారు.(ఫైల్ ఫొటో)

ఒకే ఇంట్లో ఐదుగురు శవాలుగా కనిపించారు. అందులో ఓ 9 నెలల పాప కూడా ఉంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నట్టుగా.. తొమ్మిది నెలల బాబు మాత్రం ఆకలితో అలమటించి చనిపోయాడని తెలుస్తోంది.

 • Share this:
  ఒకే ఇంట్లో ఐదుగురు శవాలుగా కనిపించారు. అందులో ఓ 9 నెలల పాప కూడా ఉంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నట్టుగా.. తొమ్మిది నెలల బాబు మాత్రం ఆకలితో అలమటించి చనిపోయాడని తెలుస్తోంది. మరో మూడేళ్ల బాలికను ప్రాణాలతో బయటపడింది. ఈ షాకింగ్ ఘటన కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని బెంగళూరు నగరం బైడరహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతులను భారతి (50), ఆమె కూతుళ్లు.. సించన (33), సింధురాణి (30), కొడుకు మధుసాగర్ (26), మనవడు(తొమ్మిది నెలల బాబు)గా గుర్తించారు. ఆమె భర్త శంకర్ జర్నలిస్టుగా ఉన్నాడు.

  కొద్ది రోజుల క్రితం ఏదో విషయంలో కలత చెందిన శంకర్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మూడు రోజులుగా ఇంట్లో వాళ్లకు ఫోన్ చేయగా.. వారి కాల్స్ లిఫ్ట్ చేయలేదు. దీంతో శుక్రవారం ఇంటికి తిరిగివచ్చిన శంకర్.. తలుపు తట్టాడు. అయితే ఎంత ప్రయత్నించినా లోపలి నుంచి సమాధానం రాలేదు. ఇంటి డోర్లు, కిటికీలు అన్ని మూసివేసి ఉండటం.. లోపలి నుంచి లాక్ చేసి ఉండటంతో.. అనుమానం వచ్చిన శంకర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేసరికి ఇంట్లో ఐదుగురు చనిపోయి(Found Dead) కనిపించారు.

  Rs 52 Crore In Bank Account: పింఛన్ అకౌంట్‌లో రూ. 52 కోట్లు.. షాక్ తిన్న వృద్దుడు.. అతడు ఏమన్నాడంటే..

  అయితే వీరిలో నలుగురు పెద్దలు ఆత్మహత్య చేసుకోగా.. చిన్నారి మృతదేహం బెడ్‌పై ఉంది. ఆ బాబు ఆకలితో అలమటించి చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. మరో బాలిక అక్కడే చాలా నీరసంగా.. దీనస్థితిలో కనిపించింది. ఆ పాపను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం. ఈ విషయంపై సమాచారం అందుకున్న పశ్చిమ డీసీసీ సంజీవ్ పాటిల్(Sanjeev Patil) సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించామని చెప్పారు.

  షార్ట్స్ వేసుకొని ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన అమ్మాయి.. అనుమతించని సిబ్బంది.. చివరకు అలా..

  ఇక, శంకర్ స్థానిక న్యూస్ పేపర్‌లో పనిచేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చుట్టుపక్కల వాళ్లను ప్రశ్నిస్తున్నారు. ఆ కటుంబాన్ని చివరిసారిగా ఎప్పుడు చూశారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఘటన స్థలంలో ఇప్పటివరకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టమ్ నివేదిక తర్వాత వారు ఎలా మరణించారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అన్నారు.

  Hyderabad: ఆమె స్కూల్‌లో ఆయా.. బాత్‌రూమ్‌లో పిల్లాడిని లైంగికంగా వేధించింది.. కట్ చేస్తే..

  అదే కారణమా..?
  సించనకు పెళ్లి తర్వాత భర్తతో విభేదాలు చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆమెకు మూడేళ్ల పాప ఉంది. రెండో కాన్పు కోసం తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. బాబు జన్మించాక కూడా భర్త ఇంటికి వెళ్లలేదు. అయితే భర్త ఇంటికి వెళ్లాలని కొద్ది రోజులుగా సించనను తండ్రి శంకర్‌ కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే శంకర్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని.. ఆ తర్వాత ఇలా జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: