హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

హాస్పిటల్ లో పేషెంట్ కి ఎమర్జెన్సీ..ట్రాఫిక్ జామ్ లో డాక్టర్..అతడి పనికి దేశం సెల్యూట్

హాస్పిటల్ లో పేషెంట్ కి ఎమర్జెన్సీ..ట్రాఫిక్ జామ్ లో డాక్టర్..అతడి పనికి దేశం సెల్యూట్

డాక్టర్ గోవింద్ నందకుమార్

డాక్టర్ గోవింద్ నందకుమార్

Doctor Run For Patient Surgery : వైద్యో నారాయణో హరిః అని అంటారు మన పెద్దలు. అంటే డాక్టర్లు దేవుడితో సమానమని అర్థం. అయితే కొందరు వైద్యులు(Doctors) డబ్బు సంపాదించాలనే దురాశలో పడి రోగి జీవితంతో ఆడుకుంటున్నారు అది వేరే విషయం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Doctor Run For Patient Surgery : వైద్యో నారాయణో హరిః అని అంటారు మన పెద్దలు. అంటే డాక్టర్లు దేవుడితో సమానమని అర్థం. అయితే కొందరు వైద్యులు(Doctors) డబ్బు సంపాదించాలనే దురాశలో పడి రోగి జీవితంతో ఆడుకుంటున్నారు అది వేరే విషయం. కరోనా వంటి అత్యంత తీవ్రమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ఆ వైద్యుల మాదిరిగానే ఇప్పుడు బెంగుళూరు(Bengaluru)కు చెందిన ఓ డాక్టర్ పేషెంట్ కు సర్జరీ(Surgery) చేసి ప్రాణాలు కాపాడేందుకు 45 నిమిషాలు పరుగెత్తిన(Running) ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

అసలేం జరిగింది

బెంగుళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఈ నగరంలో ప్రపంచ ప్రసిద్ధి చెందినందున, ఇక్కడ ట్రాఫిక్ కూడా అంతే భారీ స్థాయిలో ఉంటుంది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ లు బెంగుళూరులో సర్వసాధారణమైపోయాయి. దీనివల్ల ఈ నగరంలో అంబులెన్స్ లు కూడా అత్యవసర పరిస్థితిలో ఉన్న పేషెంట్ల దగ్గరకు సకంలో చేరుకోని పరిస్థితి కూడా తలెత్తుతోంది. ప్రపంచంలోని రోజువారీ ట్రాఫిక్ సమస్యలతో బాధపడే నగరాల్లో బెంగళూరు ఒకటి. అయితే బెంగళూరులోని ప్రముఖ మణిపాల్ హాస్పిటల్స్ ల గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ అయిన డాక్టర్ గోవింద్ నందకుమార్(Doctor Govind Nandakumar) ఆగస్టు 30న ఓ పేషెంట్ కు సర్జరీ చేసేందుకు ఇంటి నుంచి హాస్పిటల్ కు బయల్దేరాడు. హాస్పిటల్ లో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న పేషెంట్ కు అత్యవసర ల్యాప్రోస్కోపిక్ పిత్తాశయ సర్జరీ చేసేందుకు సర్జాపూర్‌ ఏరియాలోని మణిపాల్ ఆసుపత్రికి తన కారులో డాక్టర్ వెళ్తున్నారు. అయితే సర్జాపూర్-మార్తహళ్లి మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో డాక్టర్ కారు భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది. అయితే ఇలాగే ఉంటే చాలా ఆలస్యమై పేషెంట్ కు సమయానికి సర్జరీ చేయలేకపోతే అతడి ప్రాణాలకు ప్రమాదం అని భావించిన డాక్టర్ గోవింద్ నందకుమార్..ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న కారుని అక్కడే వదిలేసి ఆలస్యం చేయకుండా దాదాపు 3 కిలోమీటర్లు 45 నిమిషాల పాటు పరుగు తీసి సమయానికి ఆసుపత్రికి చేరుకున్నాడు. రోగికి మత్తుమందు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న వైద్యులు ఆపరేషన్ థియేటర్‌కు చేరుకున్న వెంటనే గోవింద్ బృందం రంగంలోకి దిగింది. వెంటనే డాక్టర్ గోవింద్ నందకుమార్ సర్జరీ చేసేందుకు సర్జరీ బట్టలు తెచ్చుకుని సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. రోగి సకాలంలో డిశ్చార్జ్ అయ్యాడని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Viral Video : అట్లుంది మరి..పని చేయట్లేదని పోలీసులనే లాకప్ లో పెట్టాడు

అయితే డాక్టర్ పరుగెత్తుకుంటూ హాస్పిటల్ కు చేరిన విషయం బయటకు రావడంతో దీనిపై నెటిజన్లు ఆ డాక్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశం మీకు సెల్యూట్ చేస్తోంది సార్ అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Best dressed celebrities : బెస్ట్ డ్రెస్ లో అదరగొట్టిన ముద్దుగుమ్మలు

కాగా,దీనిపై డాక్టర్ గోవింద్ నందకుమార్ మాట్లాడుతూ.."ప్రతిరోజూ నేను బెంగుళూరు మధ్యలో నుండి బెంగుళూరుకు ఆగ్నేయంగా ఉన్న సర్జాపూర్‌లోని మణిపాల్ ఆసుపత్రికి ప్రయాణిస్తాను. నేను సర్జరీ కోసం ఇంటి నుండి బయలుదేరాను. నా బృందం హాస్పిటల్ లో ఆపరేషన్ కు సిద్ధంగా ఉంది. అన్ని సన్నాహాలు జరిగాయి. ఆస్పత్రికి వచ్చిన తర్వాత శస్త్ర చికిత్స చేయాలి. అయితే రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. నాకు డ్రైవర్ ఉన్నాడు, కాబట్టి నేను కారును వదిలి వెళ్ళగలిగాను. రెగ్యులర్ గా జిమ్ చేయడం వల్ల రన్నింగ్ నాకు సులువైంది. నేను ఆసుపత్రికి మూడు కిలోమీటర్లు పరిగెత్తి సమయానికి చేరుకున్నారు"అని చెప్పాడు.

First published:

Tags: Bengaluru, Doctors

ఉత్తమ కథలు