కర్నాటకలో కొలువైన జల నరసింహస్వామి దర్శనభాగ్యం భక్తులకు కలిగింది. దాదాపు నాలుగు సంవత్సరాల (Opened 4years)తర్వాత ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు దేవస్థానం అధికారులు. కర్నాటక రాష్ట్రం బీదర్(Bidar)కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది జల నరసింహస్వామి దేవాలయం(Jala Narasimhaswamy Temple). కర్నాటక (Karnataka)రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మికక్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని పురాంతర నరసింహ ఆలయంగా భక్తులు పిలుస్తారు. మణిచోలలోని కొండ కింద ఆలయం ఉంటుంది. అందులో నరసింహస్వామి కొలువై ఉంటారు. ఆలయంలోకి వెళ్లాలంటే 300 మీటర్ల సొరంగ (300 Meters tunnel)మార్గం గుండా వెళ్లి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. నారసింహుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఛాతి భాగం వరకూ నీళ్లు ఉండే సొరంగ మార్గంలో భక్తులు తడుచుకుంటూనే (Drowning in the waters)వెళ్లి నరసింహస్వామిని దర్శించుకుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన ఆలయంలోకి నాలుగేళ్లుగా భక్తులకు అనుమతి లేకపోవడంతో ఒకింత నిరాశకు గురయ్యారు.
ఎన్నాళ్లకీ దర్శనభాగ్యం..
ప్రస్తుతం దర్శనభాగ్యం కల్పించడంతో కర్నాటకతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సొరంగమార్గంలో నీరు అధికంగా ఉండటం, ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండటంతో దేవస్థానం అధికారులు భక్తులను లోపలికి అనుమతించలేదు.
The world's only NARASIMHA temple in water!! #JaiNarasimha pic.twitter.com/AWfdxzCjKY
— Apsara ?? (@Indigen_Apsara) July 13, 2021
అంతా నారసింహుడి మహత్యం..
నాలుగేళ్ల క్రితం ఆలయాన్ని మూసివేశారు. తర్వాత రెండేళ్లకు ఆలయం తెరిచే క్రమంలో కరోనా విజృంభించింది. దాంతో మరో రెండేళ్ల పాటు జల నరసింహస్వామి ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు.ప్రస్తుతం పురాంతర నరసింహ ఆలయ సొరంగ మార్గంలో నీరుశాతం తగ్గడంతో భక్తులను అనుమతిస్తున్నారు. నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం సొరంగమార్గంలో ఆక్సిజన్ అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే ఆలయం సొరంగమార్గం, వెలుపల భక్తులకు మార్గం కనిపించేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.
అద్భుతమైన పుణ్యక్షేత్రం..
జల నరసింహస్వామి దర్శనం భక్తులకు ఓ మధురానుభూతి లాంటిది. ఎందుకంటే ఛాతిలోతు నీళ్లలో మునుగుతూ సొరంగమార్గంలో భగవంతుడ్ని ప్రార్దిస్తూ వెళ్లడం మాటల్లో వర్ణించలేనంత గొప్పగా ఉంటుంది. శుక్రవారం నుంచి తెరుచుకున్న ఆలయానికి భక్తులను ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 10గంటల వరకు భక్తులను అనుమతిస్తున్నారు. కర్నాటక రాష్ట్రం బీదర్‌లోని ప్రసిద్ధ పర్యాటక, పుణ్యక్షేత్రానికి దేశం నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల సంఖ్యకు తగినట్లుగానే ఆలయ అధికారులు క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.