హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

రూ.52వేల లిక్కర్ కొన్నాడు.. ఈ మందుబాబుకి ముందుచూపు ఎక్కువ

రూ.52వేల లిక్కర్ కొన్నాడు.. ఈ మందుబాబుకి ముందుచూపు ఎక్కువ

'నువ్వు మందుబాబు ఆణిముత్యానివి'.. 'నీ ముందు చూపుకు సలాం' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

'నువ్వు మందుబాబు ఆణిముత్యానివి'.. 'నీ ముందు చూపుకు సలాం' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

'నువ్వు మందుబాబు ఆణిముత్యానివి'.. 'నీ ముందు చూపుకు సలాం' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

  కరోనా, లాక్‌డౌన్‌తో ఇప్పుడు లిక్కర్‌పైనా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మూడో విడత లాక్‌డౌన్‌లో గ్రీన్, ఆరెంజ్ జోన్లకు చాలా వరకు సడలిపంపులు ఇవ్వడంతో మద్యం దుకాణాలు కూడా తెరచుకున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయము మందుబాబులంతా వైన్ షాప్‌ల ముందు వాలిపోయారు. ఒక్క బాటిల్ కోసం గంటల తరబడి కిలో మీటర్ల మేర క్యూలో నిలబడుతున్నారు. ఇన్ని రోజుల లాక్‌డౌన్‌లో ఇంటి కోసం పాల ప్యాకెట్ కోసం బయటకు వెళ్లారో లేదో గానీ.. లిక్కర్‌కు మాత్రం ఎగబడుతున్నారు. ఐతే కొందరు మాత్రం వేలకు వేలు పోసి పెద్ద మొత్తంలో లిక్కర్ కొనుగోలు చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.52వేల లిక్కర్ కొన్నాడు.

  ప్రస్తుతానికి పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సామాజిక దూరం పాటించడం లేదని షాపులను మూసివేయవచ్చు. కరోనా కేసులు పెరుగుతున్నాయని సడలింపులను వెనక్కి తీసుకోవచ్చు. ఇవన్నీ ఆలోచించే ఆ మందుబాబు పెద్ద మొత్తంలో మద్యం సరుకు కొనుగోలు చేశాడని సోషల్ మీడియాలో జోకులు పేల్చుతున్నారు నెటిజన్లు. 'నువ్వు మందుబాబు ఆణిముత్యానివి'.. 'నీ ముందు చూపుకు సలాం' అంటూ కామెంట్లు పెడుతున్నారు. రెండు నెలల వరకు నీకు ఢోకా లేదుపో అంటూ ఆశీర్వదిస్తున్నారు. ప్రస్తుతం అతడి మద్యం కొనుగోలుకు సంబంధించిన బిల్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

  సోషల్ మీడియాలో లిక్కర్ బిల్లు వైరల్

  First published:

  Tags: Karnataka, Liquor sales, Liquor shops, Wine shops

  ఉత్తమ కథలు