హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mobile Gardens: పిటిషనర్‌ను అభినందించిన కోర్టు.. కానీ మొబైల్‌ గార్డెన్స్‌కు నో.. ఎందుకంటే..!

Mobile Gardens: పిటిషనర్‌ను అభినందించిన కోర్టు.. కానీ మొబైల్‌ గార్డెన్స్‌కు నో.. ఎందుకంటే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశారు. తన కారు రూఫ్‌పై చిన్న గార్డెన్‌(Garden) ఏర్పాటు చేశారు. బెంగళూరు(Bengaluru) మరో ఢిల్లీలా మారడం తనకు ఇష్టం లేదని, నగరంలో పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ తమ కారుల రూఫ్‌పై గార్డెన్‌ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించాలని కోరారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Bangalore [Bangalore], India

ప్రస్తుతం వ్యాప్తంగా కాలుష్యం సమస్య పెరుగుతోంది. చాలా నగరాలు తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. పర్యావరణ పరిరక్షణకు కొందరు వ్యక్తులు, సంస్థలు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇదే తరహాలో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశారు. తన కారు రూఫ్‌పై చిన్న గార్డెన్‌(Garden) ఏర్పాటు చేశారు. బెంగళూరు(Bengaluru) మరో ఢిల్లీలా మారడం తనకు ఇష్టం లేదని, నగరంలో పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ తమ కారుల రూఫ్‌పై గార్డెన్‌ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించాలని కోరారు. ఈ మేరకు కోర్టులో ఓ ప్రజా ప్రయోజన పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను మంగళవారం కర్ణాటక హైకోర్టు విచారించింది. మూవింగ్‌ గార్డెన్స్‌ ఏర్పాటు చేయడం, పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచించడం మంచి ఆలోచన అని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. కానీ పిటిషన్‌ను పిల్‌గా స్వీకరించడానికి నిరాకరించింది. అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పర్యావరణ పరిరక్షణకు మూవింగ్‌ గార్డెన్స్‌(Moving Gardens)

కర్ణాటక హైకోర్ట్‌లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వ్యక్తి ఎస్ కె సురేష్. ఆయన న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఆయన తనకు చెందిన టాటా నానో కారుపై చిన్న గార్డెన్‌ ఏర్పాటు చేశారు. దీనికిపై కొన్ని వార్తా పత్రికలు ప్రత్యేక కథనాలను కూడా ప్రచురించాయి. అయితే సురేష్‌ అందరూ తమ కారులపై చిన్న గార్డెన్‌లు ఏర్పాటు చేస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందని కోరుతూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలాంటి గార్డెన్‌ల సంఖ్య పెరగడం వల్ల బెంగళూరు నగరంలో కాలుష్యం తగ్గుతుందని, ఆక్సిజన్‌ పెరుగుతుందని తెలిపారు. కోర్టు మూవింగ్‌ గార్టెన్స్‌ అందరూ ఏర్పాటు చేయాలని ఆదేశించాలని కోరారు. తాను చేసిన ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ వచ్చిన వార్తా కథనాలను కోర్టుకు అందజేశారు. సురేష్‌ ప్రయత్నాన్ని అభినందించిన కోర్టు అనేక కారణాలను పేర్కొంటూ పిటిషన్‌ను పిల్‌గా స్వీకరించడానికి నిరాకరించింది.

ఆలోచన మంచిదే.. ఆదేశించడం సరికాదు

సురేష్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రసన్న బి వరాలే, జస్టిస్ అశోక్ ఎస్ కినాగితో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. న్యాయమూర్తులు మాట్లాడుతూ.. పిటిషనర్ కోరిన విధంగా ఆదేశాలు జారీ చేయడం అనేది కచ్చితంగా ఒక వ్యక్తి ఇండివిడ్యువల్‌ ఛాయిస్‌ను అతిక్రమించినట్లు అవుతుందని చెప్పారు.

అంతే కాకుండా ప్రజలకు తమ వాహనాలను తమ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకొనే హక్కు ఉంటుందని, ఇతర పనులకు వినియోగించాలని ఆదేశించడం పర్సనల్ ఇండివిడ్యువల్‌ రైట్‌ను అధిగమించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. తమ కారు రూఫ్‌పై మూవింగ్‌ గార్డెన్‌లు ఏర్పాటు చేయడమనేది ఎవరికి వారు తీసుకోవాల్సిన నిర్ణయమని పేర్కొన్నారు. కచ్చితంగా అందరూ గార్డెన్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించడం మోటారు వాహన చట్టాలు లేదా నిబంధనలకు అనుగుణంగా ఉండకపోవచ్చని తెలిపారు.

First published:

Tags: Bangalore, High Court, Karnataka

ఉత్తమ కథలు