Home /News /national /

BENGALURU CONTEMPT FOR KANNADA SAY KTAKA BODIES ON GOVTS MOVE TO FUND SANSKRIT UNIVERSITY BJP SLAMS ALARMISTS GH VB

Sanskrit University: సంస్కృత భాషాభివృద్ధిపై కన్నడనాట దుమారం.. BJP-RSS​ కుట్రేనని భాషాసంఘాల ఫైర్!

బసవరాజ్ బొమ్మై (PTI ఫైల్)

బసవరాజ్ బొమ్మై (PTI ఫైల్)

Sanskrit University: కర్ణాటకలో సంస్కృత విశ్వవిద్యాలయం నిర్మాణానికి రూ.324 కోట్ల నిధులు కేటాయిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. బెంగళూరు శివారు ప్రాంతమైన మగడి తాలూకాలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది.

ఇంకా చదవండి ...
కర్ణాటకలో(Karnataka) సంస్కృత విశ్వవిద్యాలయం(Sanskrit University) నిర్మాణానికి రూ.324 కోట్ల నిధులు కేటాయిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. బెంగళూరు(Bangalore) శివారు ప్రాంతమైన మగడి తాలూకాలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై కన్నడ సంఘాలు (kannada language organisations) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ భాషను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ కన్నడ భాషా సంఘాలు, భాషాభిమానులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మరోవైపు సీఎం బసవరాజ్ బొమ్మై (cm basavaraj bommai) నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. సంస్కృతానికి మద్దతునిచ్చే అంశంలో వెనుకాడబోమని పునరుద్ఘాటించింది.

Amazon Great Republic Day Sale 2022: వాటిపై భారీ డిస్కౌంట్.. రూ. 2,799 ధరకే ఆ ప్రొడక్ట్ సొంతం..


జీతాలకు డబ్బు లేదంటూనే..
కన్నడను విస్మరించి సంస్కృతానికి ప్రాధాన్యమివ్వాలనే కుట్రగా ప్రభుత్వ నిర్ణయాన్ని అభివర్ణించిన ''కర్ణాటక రక్షణ వేదిక''.. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. హంపిలోని కన్నడ విశ్వవిద్యాలయం(Hampi University) ఉద్యోగులకు జీతాలు, ఫెలోషిప్‌లు చెల్లించేందుకు డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం.. సంస్కృత భాషకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోందని సంస్థ అధ్యక్షుడు టీఏ నారాయణ గౌడ మండిపడ్డారు.

''బీజేపీ ప్రభుత్వం కన్నడ భాషను చిన్నచూపు చూస్తోంది. హిందీని, సంస్కృతాన్ని మనపై రుద్దుతోంది, స్కూళ్లు, కాలేజీల్లో కన్నడను చంపేస్తోంది. ఎవరికీ ఉపయోగం లేని సంస్కృత విశ్వవిద్యాలయం (Sanskrit University) కోసం వందల కోట్లు వెచ్చించే ముందు కన్నడ యూనివర్సిటీని, కర్ణాటకలోని పలు విశ్వవిద్యాలయాల్లోని కన్నడ పీఠాలను కాపాడుకోవాలి. మన మంచితనాన్ని బలహీనతగా ప్రభుత్వం భావిస్తే, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుంది'' అని ఆయన అన్నారు.

సంస్కృత యూనివర్సిటీకి వ్యతిరేక ఉద్యమం సోషల్ మీడియాలోనూ కనిపించింది. #NotoSanskritUniversity అనే హ్యాష్​ట్యాగ్ ట్విట్టర్​లో ట్రెండ్​ అయింది. దీనికి 50 వేలకు పైగా ట్వీట్లు, రీట్వీట్‌లు వచ్చాయి. తమ భాష భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టి.. కన్నడపై ఆర్‌ఎస్‌ఎస్ పైచేయి సాధించడం కోసం పన్నిన కుట్ర అని నవయుగ కన్నడ కార్యకర్త గణేష్ చేతన్ పేర్కొన్నారు.

"కన్నడ సహా అన్ని భారతీయ భాషలకు సంస్కృతం మాతృభాష అని ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇది అబద్ధపు ప్రచారం మాత్రమే. కన్నడ ఒక ద్రవిడ భాష. ఇది సంస్కృతం వంటి ఆర్యుల భాష కాదు. నిజం చెప్పాలంటే కన్నడ, సంస్కృతం ఒకే విధమైన ప్రాచీన భాషలు. కన్నడ కంటే సంస్కృతం ఎక్కువైనది, ముఖ్యమైనదేం కాదు. వందల కోట్లు వెచ్చించి సంస్కృతాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం కర్ణాటక ప్రభుత్వానికి లేదు. ఇది ఆర్​ఎస్​ఎస్​(RSS), బీజేపీ రహస్య ఎజెండాలో భాగమే. మేము వాటితో పోరాడతాం" అని గణేష్ స్పష్టం చేశారు. కర్ణాటకలో సంస్కృత ప్రచారం అనేది "ఒకే దేశం-ఒకే భాష" అనే లక్ష్యాన్ని సాధించే అతిపెద్ద కుట్రలో ఒక భాగమని మరో కన్నడ భాషా కార్యకర్త అరుణ్ జవగల్ అనుమానం వ్యక్తం చేశారు.

Zodiac Signs-Luxury: లగ్జరీ అంటే వీరికి ప్రాణం.. ఆ 5 రాశులవారు వీళ్లే.. మీరున్నారేమో చూసుకోండి..


ఆ నిర్ణయంతో వివాదం మొదలు..
డిగ్రీలో కన్నడ భాషను తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను.. ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో పనిచేసే సంస్కృత భారతి సవాలు చేయడంతో వివాదం మొదలైంది. 'డిగ్రీ విద్యలో కన్నడ భాషను తప్పనిసరి చేసింది బీజేపీ ప్రభుత్వమే. ఆ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టులో(Karnataka high court) సవాలు చేసింది బీజేపీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్. కన్నడిగులను మోసం చేసేందుకు ఇదో రకమైన కుట్ర' అని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

'కన్నడ-సంస్కృత నిరసనలతో అధికార బీజేపీ ఎదురుదాడికి దిగింది. భారతీయ భాషలన్నింటికీ సంస్కృతం మూలం.. ప్రస్తుత ఆందోళనలకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే కారణం' అని ఎంపీ ప్రతాప్ సింహా ఆరోపించారు. సంస్కృతం ప్రపంచంలోనే పురాతన శాస్త్రీయ భాష అని ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ అన్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Bangalore

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు