Home /News /national /

Viral Video: కోటి రూపాయలిస్తా.. ఆ బీజేపీ ఎమ్మెల్యేని చంపేయండి.. కాంగ్రెస్ నేత వీడియో వైరల్

Viral Video: కోటి రూపాయలిస్తా.. ఆ బీజేపీ ఎమ్మెల్యేని చంపేయండి.. కాంగ్రెస్ నేత వీడియో వైరల్

కాంగ్రెస్ నేత గోపాలక్రిష్ణ

కాంగ్రెస్ నేత గోపాలక్రిష్ణ

Viral Video: వీడియో ఎప్పటిదనే దానిపై సమాచారం లేదని పోలీసులు వెల్లడించారు. అది ఇటీవలిదేనా? లేదంటే పాతదా? అనే దానిపై ఆరా తీస్తున్నారు.

    ఓ వీడియో టేప్ కర్నాటక రాజకీయాలను (Karnataka politics) షేక్ చేస్తోంది. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాధ్‌ (BJP MLA Vishwanath)ను చంపేయమని కాంగ్రెస్ నేత గోపాలక్రిష్ణ (Congress leader gopala krishna) ఓ వ్యక్తితో చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీకు కోటి రూపాయలిస్తాను.. అతడిని ఫినిష్ చేయమని చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. మూడు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో కాంగ్రెస్ నేత గోపాల క్రిష్ణ ఓ సోఫాలో కూర్చొని ఉన్నాడు. ఓ వ్యక్తితో మాట్లాడుతూ... ‘‘ఆ బీజేపీ ఎమ్మెల్యేని ఫినిష్‌ చేయ్‌. చంపెయ్‌. నీకు కోటి రూపాయలు ఇస్తాను. ఇంకా ఎక్కువైనా పరవాలేదు. దీని గురించి ఎవరికి తెలియదు. ఈ విషయం మన ఇద్దరి మధ్యే ఉంటుంది’’ అవతలి వ్యక్తికి చెప్పారు గోపాల క్రిష్ణ.

    Vaccine Offer: బంపర్ ఆఫ‌ర్.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే 60 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ

    ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఐతే ఈ వీడియో ఎప్పటిదనే దానిపై సమాచారం లేదని పోలీసులు వెల్లడించారు. అది ఇటీవలిదేనా? లేదంటే పాతదా? అనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కర్నాటక రాజకీయాల్లో సెగలు రేపుతుండడంతో స్వయంగా హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందించారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. ఈ విషయమై ఎమ్మెల్యే విశ్వనాథ్ కూడా తనో మాట్లాడారని చెప్పారు.

    Mamata Banerjee: జాతీయ గీతాన్ని అవమానిస్తారా? మమతా బెనర్జీపై కేసుపెట్టిన బీజేపీ నేత

    ''ఈ వీడియో గురించి మంగళవారం రాత్రి నాకు తెలిసింది. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశ్వనాథ్‌కు భద్రత కల్పించాలని భావిస్తున్నాం. దీనిపై ఇంటిలిజెన్స్‌ శాఖ నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం పోలీసులు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు’’ అని అరగ జ్ఞానేంద్ర పేర్కొన్నారు.

    Fishermen missing: అల్లకల్లోలంగా సముద్రం.. 15 పడవలు బోల్తా.. మత్స్యకారులు గల్లంతు

    కాగా, ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ యెలహంక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2008, 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఆయన విజయాలు సాధించారు. 2018లో ఆయనపై కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన గోపాలకృష్ణ విశ్వనాథ్‌పై 80 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ లేకుండా చేసేందుకే విశ్వనాథ్‌పై హత్యకు కుట్ర పన్నారా? లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, Congress, Karnataka, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు