అద్దం ఉంది జాగ్రత్త... ఆరుబయట టాయిలెట్‌కి వెళ్లకుండా... బెంగళూరులో కొత్త ప్రయోగం

స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్‌ని పెంచుకోవడం కోసం.... BBMP... సిటీలోని వేర్వేరు మూలల్లో QR కోడ్స్‌తో ఉన్న ఐదు అద్దాల్ని ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రజలు దగ్గల్లో పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు.

news18-telugu
Updated: January 14, 2020, 12:32 PM IST
అద్దం ఉంది జాగ్రత్త... ఆరుబయట టాయిలెట్‌కి వెళ్లకుండా... బెంగళూరులో కొత్త ప్రయోగం
అద్దం ఉంది జాగ్రత్త... ఆరుబయట టాయిలెట్‌కి వెళ్లకుండా... బెంగళూరులో కొత్త ప్రయోగం
  • Share this:
మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... దేశవ్యాప్తంగా సులభ్ కాంప్లెక్సులూ, ప్రైవేట్, పబ్లిక్ టాయిలెట్స్‌లూ ఉన్నా... చాలా మంది యూరిన్, టాయిలెట్‌ల కోసం ఆరుబయటికే వెళ్తున్నారు. గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా పేరున్న బెంగళూరులోనూ ఈ సమస్య ఎక్కువగానే ఉంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంక్‌లో బెంగళూరు వెనకబడుతోంది. దీనికి చెక్ పెట్టాలనుకున్న అక్కడి బృహత్ బెంగళూరు మహానగర్ పాలికే (BBMP) అధికారులు... స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్‌ని పెంచుకోవడం కోసం.... సిటీలోని వేర్వేరు మూలల్లో QR కోడ్స్‌తో ఉన్న ఐదు అద్దాల్ని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రజలు దగ్గల్లో పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలాగే ఎక్కడ బడితే అక్కడ యూరిన్, టాయిలెట్‌కి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఈ అద్దాలు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు.

ఇంతకు ముందు అధికారులు... భారీ ఫైన్లు వేశారు. అయినా ఫలితం లేదు. గోడలపై దేవుళ్ల బొమ్మలు వేయించారు. అయినప్పటికీ ప్రజలు ఆరుబయట మలమూత్ర విసర్జన మానట్లేదు. ఫలితంగా బెంగళూరులో చాలా చోట్ల దుర్వాసన ఎక్కువవుతోంది. ఈ అద్దాల ఏర్పాటు వల్ల... అద్దాన్ని చూసి... సిగ్గుపడి... యూరిన్‌కి వెళ్లకుండా ఉంటారని అధికారులు అనుకుంటున్నారు. ఇక QR కోడ్‌ని స్కాన్ చేస్తే... దగ్గర్లో ఎక్కడ పబ్లిక్ టాయిలెట్ ఉందో మ్యాప్ రూపంలో కనిపిస్తుంది. ఇందుకోసం BBMP తెచ్చిన సహాయ యాప్‌ని డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా కోడ్‌ను స్కాన్ చెయ్యాల్సి ఉంటుంది. వీటిని అందరూ అర్థం కన్నడ భాషతోపాటూ... ఇంగ్లీష్ భాష కూడా రాసి ఉంటుంది.

ఇలాంటి ఐడియా వల్ల ప్రజలపై ఫైన్ల భారం వేసే పని తప్పుతుందనీ, ప్రజలు కూడా సమస్యను అర్థం చేసుకొని... ఆరుబయట యూరిన్‌కు వెళ్లకుండా ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో... ప్రతీ 600 మీటర్ల దూరంలో ఓ పబ్లిక్ టాయిలెట్ ఉందని అధికారులు చెబుతున్నారు.

కొంతమంది ఏమంటున్నారంటే... ఇలాంటి అద్దాల వల్ల ఉపయోగం ఉండదనీ... ఆందోళనలు జరిగినప్పుడు ప్రజలు వీటిని పగలగొట్టేస్తారనీ అంటున్నారు. దీనికి అధికారులు తెలివైన సమాధానం చెప్పారు. ఈ అద్దాల్ని... గ్లాస్ మెటీరియల్‌తో తయారుచెయ్యలేదట. రాళ్లతో పగలగొట్టినా అవి పగలవని అంటున్నారు. వాటిని ఓ చోటి నుంచీ మరో చోటికి ఈజీగా తరలించవచ్చని చెబుతున్నారు. మొత్తం 5 అద్దాలకూ కలిపి రూ.2 లక్షలు ఖర్చు చేసినట్లు వివరించారు. వీటిపై ప్రజలు పాటిజివ్‌గా స్పందిస్తే... మరిన్ని చోట్ల ఇలాంటి అద్దాల్ని ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.

First published: January 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు