అతనికి 67 సంవత్సరాలు. ఆమెకు 35ఏళ్లు. ఇద్దరూ శృంగారం చేస్తున్నారు. షడన్‌గా పెద్దాయనకు హార్ట్ ఎటాక్ (Heart attack)వచ్చింది. అంతే శృంగార సుఖం అనుభవిస్తూనే తుది శ్వాస విడిచాడు. తనతో పడక గదిలో బెడ్‌పైన పడుకున్న వ్యక్తి అర్ధాంతరంగా ప్రాణాలు వదలడంతో ఆమె భయపడిపోయింది. తానే చంపానని అందరూ అనుకుంటారని..విషయం బయటపడితే తన పరువు పోతుందని భావించి మృతదేహాన్ని తన బంధువుల సాయంతో ప్లాస్టిక్ సంచి(Plastic bag)లో చుట్టేసి నిర్మాణుష్య ప్రదేశంలో పడేసి చేతులు దులుపుకుంది. చనిపోయిన వ్యక్తి కర్నాటక రాజధాని బెంగుళురు(Bangalore)లో వ్యాపారి కాగా అతనితో శృంగారంPhysical encounterలో పాల్గొన్న మహిళ అతని ఇంట్లో పని మనిషి. అందుకే సీక్రెట్ రిలేషన్షిప్ బయటపడకుండా ఈవిధంగా డ్రామా స్కెచ్ వేసినప్పటికి పోలీసులకు చిక్కింది.
పని మనిషితో పడక సుఖం..
బెంగుళూరులోని జేపీనగర్ పుట్టెనహళ్లి ప్రాంతంలో 67సంవత్సరాల వయసు కలిగిన బాలసుబ్రమణ్యం అనే ఓ వ్యాపారి అనుమానాస్పదమృతి కేసును చేధించడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఈనెల 16వ తేదిన చనిపోయిన బాలసుబ్రమణ్యం మృతదేహం ఎవరూ తిరగని ప్రదేశంలో ప్లస్టిక్ కవర్లో చుట్టి పారేసినట్లుగా గుర్తించిన పోలీసులు విచారణ జరిపారు. అందులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. అనుమాన్పదమృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహంపై గాయలు లేకపోవడంతో పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సహజ మరణంగా గుర్తించారు. అయితే గుండెపోటుతో చనిపోయినట్లుగా తేలడంతో మృతుని ఇంట్లో పని చేస్తున్న మహిళను విచారించారు.
పని పూర్తి కాకుండానే పోయిన ప్రాణం..
బాలసుబ్రమణ్యం ఇంట్లో పని చేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లుగా పోలీసులు రాబట్టారు. పని మనిషితో శృంగారం చేస్తున్న సమయంలోనే బెడ్‌పైనే హార్ట్ ఎటాక్ రావడం చనిపోవడం జరిగిందని పనిమనిషి అంగీకిరించింది. అంతే కాదు మృతుడితో మహిళకు ఉన్న వివాహేతర సంబంధం ఆమె భర్తకు కూడా తెలసని గుర్తించారు. ఈక్రమంలోనే వ్యాపారి బాలసుబ్రమణ్యం మృతి తనపై రాకుండా భర్త, సోదరుడ్ని పిలిపించి శవాన్ని దూరంగా పడేసినట్లుగా మహిళ అంగీకరించింది.
శవాన్ని దూరంగా పడేసిన వైనం..
మృతుడు బాలసుబ్రమణ్యం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని తేలింది. గతేడాది యాంజియో ప్లాస్టీ కూడా చేయించుకున్నాడనీ చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారి బాలసుబ్రమణ్యం కుటుంబ సభ్యులను విచారించడంతో పని మనిషితో ఉన్న వివాహేతర సంబంధం బయటపడిందన్నారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.