కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం పేలుడు సంభవించింది. చామరాజపేటలోని (Chamarajpet) రాయన్ సర్కిల్ (Rayan Circle) సమీపంలో గోడౌన్లో జరిగిన పేలుడులో ముగ్గురు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలంలో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు.. కొద్ది మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. పేలుడు జరిగిన సమయంలో భారీ శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు. తాము ఇళ్లలో నుంచి పరుగులు తీశామని అన్నారు. పేలుడు జరగడంతో తాము తీవ్రమైన భయాందోళనకు గురైనట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మధ్యాహ్నం 12.10 గంటలకు పేలుడు జరిగిందని తెలిపారు.
ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిని మనోహర్(29), అస్లాం(45), ఫయాజ్(50)గా గుర్తించారు. ఈ ప్రమాదం నుంచి గోడౌన్ యజమాని ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే పేలుడుకు సంబంధించిన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్టుగా పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengaluru, BLAST, Crime news