BL Santosh: నాటి ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్.. నేడు అసాధ్యుడయ్యాడు.. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్ ఘనత 

బీఎల్ సంతోష్

కేంద్ర కేబినేట్‌ను ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. అయితే కేబినెట్ విస్తరణ తర్వాత భాజపా ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న బీఎల్ సంతోశ్‌ చాలా శక్తిమంతంగా మారారని ఆర్ఎస్ఎస్‌తో పాటు కాషాయం పార్టీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి.

  • Share this:
కేంద్ర కేబినేట్‌ను ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. అయితే కేబినెట్ విస్తరణ తర్వాత భాజపా ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న బీఎల్ సంతోశ్‌ చాలా శక్తిమంతంగా మారారని ఆర్ఎస్ఎస్‌తో పాటు కాషాయం పార్టీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. మూడేళ్ల వరకు ఢిల్లీ రాజకీయాలకు అపరిచితుడైన బీఎల్ సంతోశ్‌.. ఇప్పుడు బీజేపీ పగ్గాలను నియంత్రిస్తున్నారు. పూర్తి సమయం ఆర్ఎస్ఎస్ వాలంటీర్‌గా పనిచేసిన ఆయన.. బీజేపీలో క్రియాశీలకంగా మారారు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, రాత్రికి రాత్రే శక్తిమంతంగా మారడం.. కొంతమంది ఢిల్లీ పెద్దలకు నిద్రలేకుండా చేసింది. ఆయన తప్పకుండా విఫలమవుతారని సీనియర్లు కొందరు భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ, పార్టీలో మరింత క్రియాశీలకంగా మారారు సంతోశ్.

దశాబ్ద కాలంగా ఆర్ఎస్ఎస్, బీజేపీల్లో సుపరిచితుడిగా ఉన్న సంతోశ్‌ కర్ణాటకలోని ఉడిపిలో జన్మించారు. మధ్య కర్ణాటక నగరమైన దానవగెరేలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం ఆర్ఎస్ఎస్ లో చేరి ప్రస్తుత ముఖ్యమంత్రి యడియూరప్ప స్వస్థలమైన శివమొగ్గలో సేవలందించారు. దశాబ్దం క్రితం రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టిన ఈయన తన మకాం బెంగళూరుకు మార్చారు. కేంద్రమంత్రి అనంత కుమార్ తో సన్నిహితంగా మెలిగారు. ప్రజా దృష్టికి దూరంగా ఉండే సంతోశ్ అరుదుగా మాత్రమే మీడియా ముందుకు వస్తారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతూ ఎలాంటి పరిస్థితులోనూ ఆ భావజాలాన్ని విడవడని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. తెరవెనుక నుంచి పరిస్థితులను, సంక్షోభాలను నియంత్రించడాన్ని ఆయన ఎక్కువగా ఇష్టపడతారని తెలిపాయి.

కర్ణాటక బీజేపీ ఇంఛార్జీగా ఉండి అనేక సమస్యలను సంతోశ్ పరిష్కరించారు. క్రెడిట్ తీసుకోకుండా ఎల్లప్పుడూ తక్కువ ప్రొఫైల్ ను కొనసాగించారు. పార్టీ పనితీరుపై ఆయనకు యడియూరప్పకు తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. చాలాసార్లు ప్రజా క్షేత్రంలో వీరి విభేదాలు బయటపడ్డినప్పటికీ సంతోశ్ మాత్రం తనపై విమర్శలు రాకుండా చూసుకున్నారు. ఎప్పుడైతే ఢిల్లీ రాజకీయాల్లో ప్రవేశించారో.. అప్పటి నుంచే సంతోశ్ చాలా వేగంగా నేర్చుకుంటున్నారని, సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఢిల్లీలో సంతోష్ విఫలమవుతారని చాలా మంది ఆశించారు. కానీ పార్టీపై పూర్తి నియంత్రణ సాధించడమే కాకుండా మోడీ నమ్మకాన్ని గెలుచుకున్నారని కర్ణాటక బీజేపీ ఎంపీ ఒకరు తెలిపారు.

2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా దక్షిణ బెంగళూరు సిట్టింగ్ ఎంపీ అనంతకుమార్ భార్య తేజస్వినికి చేక్ పెట్టడమే కాకుండా ఆ టిక్కెట్టును తేజస్వీ సూర్యకు ఇప్పించి, ఆ స్థానంతో పార్టీని గెలిపించారు. అంతే కాకుండా తేజస్వీకి అదే ఏడాది బీజేపీ యవజన విభాగం జాతీయ అధ్యక్షుడి పదవి దక్కేలా చేశారు. కేబినెట్ మంత్రి డీవీ సదానంద గౌడను తొలగించడం, శోభా కరండ్లేజను కేంద్ర మంత్రివర్గంలోకి చేర్చడం ఆయన ఆలోచనే.

కర్ణాటక రాజకీయాల్లో సంతోశ్ జోక్యం గురించి అందరికి తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపడతారని కూడా కొందరు భావించారు. అయితే అనంతర పరిణామాలతో ఆ ఊహాగానాలను కొట్టిపారేశారు. కొంతమంది సంతోశ్‌ను నరేంద్ర మోడీతో పోల్చుతున్నారు. 20 ఏళ్ల క్రితం మోడీ కూడా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. పరిపాలనా అనుభవం లేకుండానే ముఖ్యమంత్రి అయ్యారు. సంతోష్ కూడా ఇదే మార్గంలో వెళ్లవచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Published by:Sumanth Kanukula
First published: