Jarkiholi CD Case: కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహొళి సీడీ వివాదంలో కీలక మలుపు.. కనిపించకుండా పోయిన ఆ యువతి..

దుమారం రేపిన వీడియోలోని ఓ దృశ్యం

గత కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన నరేష్ గౌడ ఇటీవల ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సీడీ వ్యవహారాన్ని బహిరంగం చేసిన సామాజిక కార్యకర్త దినేష్ కల్లహళ్లి కేసును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన సమయంలో 4 పేజీల సుదీర్ఘ వివరణ ఇచ్చారు. యువతి ప్రాణభయంతో ఉందని...

  • Share this:
    బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీలో ఉన్న యువతి అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సిట్ అధికారులు ఎట్టకేలకు ఆమె ఆచూకీ గుర్తించినట్లు తెలిసింది. ఆ సీడీ వ్యవహారం పెద్ద చర్చనీయాంశం కావడంతో ఆమె కొన్నిరోజులు ఢిల్లీ, గోవాలో ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆమెను త్వరలోనే అదుపులోకి తీసుకుని విచారణ చేపడతామని సిట్ అధికారులు ప్రకటించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరితో కలిసి ఆమె ఢిల్లీలో ఉన్నట్లు తాజాగా తెలిసిందని.. ఇప్పటికే ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయని సిట్ తెలిపింది. సదరు యువతికి సిట్ ఇప్పటికే మూడోసారి నోటీసులు పంపింది. మరో ఇరువురు అనుమానితులను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

    గత కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన నరేష్ గౌడ ఇటీవల ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సీడీ వ్యవహారాన్ని బహిరంగం చేసిన సామాజిక కార్యకర్త దినేష్ కల్లహళ్లి కేసును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన సమయంలో 4 పేజీల సుదీర్ఘ వివరణ ఇచ్చారు. యువతి ప్రాణభయంతో ఉందని, బహిరంగం చేసేలా కేసు పెడితే ఆమెకు రక్షణ కల్పించినట్టు అవుతుందన్న ఉద్దేశంతోనే ఫిర్యాదు చేశానని కల్లహళ్ళి తన వివరణలో స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. యువతి ఐదురోజుల క్రితమే హైదరాబాద్‌లో పట్టుబడినట్లు ప్రచారం సాగింది.

    అయితే.. పోలీసులు మాత్రం ధృవీకరించలేదు. ఇంకా గాలింపు కొనసాగిస్తున్నామని చెప్పారు. సీడీలో ఉన్న యువతి పట్టుబడితే గానీ కేసులో వాస్తవాలేంటనే విషయంలో ఓ క్లారిటీ వచ్చేలా లేదు. తాను అమాయకుడినని, తనకూ.. ఆ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి జార్కిహొళి ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే.. యువతి తండ్రి ఫిర్యాదును ఆర్‌టీ నగర్ పోలీస్ స్టేషన్‌కు మార్పు చేశారు. ఈ మేరకు ఆర్‌టీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. బసవేశ్వర నగర్‌లోని అనుమానితుడి ఇంట్లో సిట్ పరిశీలన చేయగా ఇటీవలే రూ.18 లక్షల విలువైన బంగారం కొనుగోలు చేసిన రసీదును గుర్తించారు. పెన్‌డ్రైవ్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: