Symbiosis Effect: ప్రేమ, సహజీవనం.. చివరకు గర్భం దాల్చిన మహిళ.. పుట్టిన బిడ్డను అతిదారుణంగా బాత్రూంకి వెళ్లి..

ప్రతీకాత్మక చిత్రం

Symbiosis Effect: ఓ 22 ఏళ్ల మహిళ అక్రమ సంబంధంతో గర్భం దాల్చింది. ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లో బిడ్డకు జన్మనిచ్చి.. అప్పుడే పుట్టిన బిడ్డను బాత్రూం కిటికీలోంచి విసిరేసింది. ఈ సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్టలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఆమె వయస్సు 22 ఏళ్లు. వివాహం కాకుండానే అక్రమ సంబంధం పెట్టుకుంది. అతడితో పట్టణంలోని ఓ రూంలో సహజీవనం చేసింది. ఫలితంగా గర్భం దాల్చింది. ఓ రోజు పురిటినొప్పులతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లగా బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే బాత్రూంకి వెళ్లి కిటికీలోంచి ఆ బిడ్డను విసిరేసింది. దీంతో పసిబిడ్డ అక్కడిక్కడే మరణించింది. ఈ సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్టలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హెసరఘట్టకు చెందిన మహిళ (22), గుడేమారనహళ్లికి చెందిన శశాంక్‌ (27) ఇద్దరు ప్రేమించుకున్నారు. పట్టణంలో ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. నెలలు నిండడంతో ఆమెను శశాంక్ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు.  ఆమెకు సిజేరియన్ చేసిన వైద్యులు పండంటి బిడ్డను బయటకు తీశారు. అక్రమ సంబంధంతో పుట్టిన ఆ పాపను ఆమె బాత్రూంకి వెళ్లి కిటికీలోంచి కిందకు విసిరేసింది.

    అక్కడ నుంచి పారిపోయింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన హాస్పిటల్‌ సిబ్బంది మాదనాయకనహళ్లి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆమెను గుర్తించి అరెస్టు చేసి అనంతరం చికిత్స కోసం లక్ష్మివిలాస్‌ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన నవజాత శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆమెను క్లినిక్‌లో చేర్చిన శశాంక్ విశ్రాంతి తీసుకోవడానికి తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అతను తిరిగి ఆసుపత్రికి వస్తుండగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తామిద్దరం ప్రేమించుకున్నామని పోలీసులకు తెలిపాడు.

    తమకు పెళ్లి కాలేదు కావునా.. శిశువు పుట్టిన తర్వాత చంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఈ విషయం అంతా తమ తల్లిదండ్రులకు చెబితే ఏమవుతుందో అని భయపడి చెప్పలేదని అన్నారు. ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్టలో చోటుచేసుకుంది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు డిచ్చార్జికాగానే అరెస్టు చేస్తామని తెలిపారు.
    Published by:Veera Babu
    First published: