టెక్నాలజీ (Technology) ఎంత విస్తరిస్తుంటే అవకాశాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. కొత్త టెక్నాలజీస్ నేర్చుకున్న వారికి ఐటీ కంపెనీలు (IT Companies) పెద్ద పీఠ వేస్తున్నాయి. వారి కోసం భారతదేశంలోని టెక్ స్టార్టప్స్‌లో (Tech Startups) అంతర్జాతీయ ఇన్వెస్టర్లు (International Investors) బిలియన్ల కొద్ది డాలర్లు గుమ్మరిస్తున్నారు. దీంతో ఇక్కడి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఉద్యోగులకు ఎక్కువ సెలవులు, జెండర్‌తో సంబంధం లేకుండా పెరంటల్ సెలవులను చాలా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఫిన్‌టెక్ కంపెనీ స్లైస్ (Slice) ఒక అడుగు మరింత ముందుకు వేసింది. తమ కంపెనీలో వారంలో మూడు రోజులు (Three-Day Work Week) మాత్రమే పని దినాలు ఉంటాయని ప్రకటించింది. అలాగని జీతంలో కోతేమి విధించడం లేదు. మార్కెట్ రేటులో 80% జీతంగా (Salary) చెల్లించేందుకు సిద్ధమని స్లైస్ ప్రకటించింది.
ఎక్కువ ఖాళీ సమయం దొరకడంతో ఉద్యోగులు తమ ఆసక్తులు, అభిరుచులను కొనసాగించుకునే వీలుంటుందని కంపెనీ చెప్తోంది. భవిష్యత్‌లో పని విధానమంతా ఇలాగే ఉంటుందని, ఒకే ఉద్యోగానికి కట్టుబడి ఉండాలని ఎవరు కోరుకోవడం లేదని స్లైస్ వ్యవస్థాపడు,28 ఏళ్ల యువ ఎంటర్ప్రెన్యూర్ రాజన్ బజాజ్ అంటున్నారు. టాలెంట్ హంట్‌లో భిన్నంగా నిలిచేందుకు స్లైస్ మూడు రోజుల పని విధానాన్ని ఎంచుకుంది.ఈ సంస్థలో ప్రస్తుతం 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వచ్చే మూడు సంవత్సరాల్లో 1,000 మంది ఇంజినీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లను నియమించే ఆలోచనలోఈ కంపెనీ ఉంది.మూడు రోజుల పనితోనూ ఉద్యోగులు పూర్తి ప్రయోజనాలు, పూర్తిజీతం పొందవచ్చు. మిగిలిన సమయంలో కొత్త కోర్సులు నేర్చుకోవచ్చు లేదా స్టార్టప్ సంస్థను నెలకొల్పవచ్చని, కో-ఫౌండర్‌ను అన్వేషించుకోవచ్చని రాజన్ సూచిస్తున్నారు.
కాగా, తక్కువ పనిదినాలు అనే కాన్సెప్ట్ గడిచిన శతాబ్ద కాలంగా ఉంది. 1926లో మొదటిసారి హెన్రీ ఫోర్డ్ ఐదు రోజుల పని దినాల సంస్కృతి ప్రవేశపెట్టారు. అలా పనిదినాలు తగ్గించడం వలన ఉత్పాదకతలో తరుగుదల ఏమైనా ఉంటుందా అని రకరకాల ప్రయోగాలు చేశారు. చాలా దేశాలు, చాలా కంపెనీలు సంవత్సరాల తరబడి నాలుగు రోజుల పనిదినాలపై ప్రయోగాలు చేశాయి. తక్కువ పని రోజుల కారణంగా ఉద్యోగి ఉత్పాదకత పెరుగుతోందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ తరహా విధానానికి ఐర్ల్యాండ్, ఐస్‌ల్యాండ్ వంటి దేశాలు మొగ్గుచూపుతున్నాయి. ఎంపిక చేసిన కొందరు ఉద్యోగులకు నాలుగు రోజుల పని విధానాన్ని 2018 నుంచి అమెజాన్ (Amazon) అమలు చేస్తోంది. పని గంటలు తగ్గించేందుకు అటు చైనా (China) కూడా ప్రయత్నాలు చేస్తోంది.
కొత్త విధానంతో పెరుగుతున్న ఉత్పాదకత..
సిలికాన్ వ్యాలీ (Silicon Valley) తరహాలోనే ఇండియన్ స్టార్టప్ రంగం కూడా పని సంస్కృతితో మమేకమైపోయింది. ఇది కొందరు ఇంజినీర్లకు ఇబ్బందికరంగా ఉంటే మరికొందరు ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఇంజినీర్ల వేతనాలు గడిచిన మూడేళ్లలో మూడు రెట్లు పెరిగాయని రాజన్ బజాజ్ అంటున్నారు. నిపుణులైన ఉద్యోగుల కోసం కంపెనీలు యుద్ధాలే చేస్తున్నాయి. జీతానికి సంబంధించి అనేక దఫాల చర్చల తర్వాత చాలా మంది ఉద్యోగులు ఘోస్ట్ స్టార్టప్స్‌గా ఉంటున్నారు.
పోటీ విపరీతంగా ఉండటం, వేతనాలు అధికమొత్తంలో భరించాల్సిన రావడం కంపెనీలకు భారంగా మారుతోంది. శాన్ ఫ్రాన్సిక్సో బే ఏరియా వంటి తక్కువ ఖర్చుతో కూడిన ప్రదేశానికి ఔట్ సోర్సింగ్ అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ సరదాగా ట్వీట్ చేశారు. సోషల్ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ వేదిక మీషో ఉద్యోగులకు నవంబర్‌లో 10 రోజుల సెలవులు ప్రకటించింది.
మరో ఫిన్‌టెక్ స్టార్టప్ భారత్‌పే ఉద్యోగులకు బీఎండబ్ల్యూ బైకులు, గ్యాడ్జెట్లు, దుబాయ్‌లో క్రికెట్ హాలీడేస్ స్పాన్సర్ చేస్తోంది. దాదాపు రెండు సంవత్సరాలు ఇళ్లకే పరిమితమైన ఉద్యోగులు క్రమంగా ఆఫీసు దారిపడుతుండటంతో స్లైస్ సంస్థ సోమవారం నుంచి త్రీ-డే వర్క్ ప్రారంభించింది. 2016లో ప్రారంభమైన స్లైస్ సంస్త యువతకు క్రెడిట్ కార్డులు అందజేస్తోంది. నిమిషం వ్యవధిలో క్రెడిట్ కార్డు అంటూ 2019లో ఫిజికల్ కార్డు లాంచ్ చేసింది. గత నెల స్లైస్ 110,000 కార్డులు జారీ చేసింది. జపాన్‌కు (Japan) చెందిన గునోసి కేపిటల్, ఇండియాలోని బ్లూమ్స్ వెంచర్స్ దీన్ని సపోర్టు చేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengaluru, Five working days, IT Employees, JOBS, Startups