హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bullet Bike: అతడు కలలలో కూడా ఊహించలేదు.. 15 ఏళ్లుగా పోరాటం.. చివరకు ఇలా ముగించాడు.. ఏం జరిగిందంటే..

Bullet Bike: అతడు కలలలో కూడా ఊహించలేదు.. 15 ఏళ్లుగా పోరాటం.. చివరకు ఇలా ముగించాడు.. ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పిల్లలు తల్లిదండ్రులకు ఏదైనా చిన్న బహుమతి ఇస్తేనే వారి సంతోషానికి అవధులుండవు. అలాంటిది ఎప్పుడో పాతికేళ్ల క్రితం పోయిన తండ్రి ఫేవరెట్ బైకును వెతికి తీసుకొస్తే.. ఇక ఆ తండ్రి ఆనందానికి హద్దుంటుందా..? సరిగ్గా ఇలాంటి అనుభవాన్ని ఆస్వాదిస్తున్నారు బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి.

ఇంకా చదవండి ...

పిల్లలు తల్లిదండ్రులకు ఏదైనా చిన్న బహుమతి(Gift) ఇస్తేనే వారి సంతోషానికి అవధులుండవు. అలాంటిది ఎప్పుడో పాతికేళ్ల క్రితం పోయిన తండ్రి ఫేవరెట్(Favorite) బైకును వెతికి తీసుకొస్తే.. ఇక ఆ తండ్రి ఆనందానికి హద్దుంటుందా..? సరిగ్గా ఇలాంటి అనుభవాన్ని ఆస్వాదిస్తున్నారు బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి. 25 ఏళ్ల క్రితం చోరీకి గురైన తన ఫేవరెట్ బుల్లెట్ బైకు(Bullet bike)ను మళ్లీ చూస్తానని రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ ఎన్ శ్రీనివాసన్ కలలో కూడా ఊహించి ఉండరు. కానీ కొడుకు నిరంతర కృషి వల్ల అది సాధ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు(Bangalore) చెందిన శ్రీనివాసన్(75) అనే వ్యక్తి రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) బుల్లెట్‌ను 1971లో కొనుగోలు చేశారు.

1996లో అది చోరీకి గురైంది. అయితే తన తండ్రి పోగొట్టుకున్న మోటార్‌సైకిల్(Motorcycle) గురించి ఆలోచించడం ప్రారంభించాడు శ్రీనివాసన్ కొడుకు అరుణ్. బైకు గుర్తుగా వాళ్లింట్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి ఉండేది. దాన్ని సాయంతో బైకును ఎలా అయినా తిరిగి పొందాలనుకున్నాడు. అప్పటి నుంచి ఆ రాయల్ ఎన్ ఫీల్డ్ బైకును వెతకడం మొదలుపెట్టాడు.

Investment Tips: రెసిడెన్షియల్​, కమర్షియల్​ ప్రాపర్టీస్‌లో ఏది బెస్ట్..? ఆ వివరాలు పూర్తిగా ఇలా..


బైక్‌ను గుర్తించాలని నిర్ణయించుకున్న అరుణ్, ముందుగా మణిపాల్‌లోని తన తండ్రి స్నేహితుడి వద్దకు చేరుకున్నాడు. బైకు ఆయన దగ్గర ఉన్నప్పుడే దొంగతనానికి గురైంది. 1995లో శ్రీనివాసన్ వేరే స్టేట్ కు ట్రాన్స్ ఫర్ అవ్వడం వల్ల బైక్‌ను తన మిత్రుడికి ఇచ్చి వెళ్లాడు. అయితే 1996లో స్నేహితుడి వద్ద నుంచి ఎవరో మోటార్‌సైకిల్‌ను చోరీ చేశారు. తర్వాత ఎంత వెతికినా బైక్ దొరకలేదని, దాంతో ప్రయత్నాలు ఆపేశానని శ్రీనివాసన్ స్నేహితుడు అరుణ్ కు చెప్పారు.

రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. అరుణ్ తన బైకు వేటను మాత్రం ఆపలేదు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లోని పాత గ్యారేజీలన్నీ వెతికాడు. ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆ బైకు వివరాలను వెతకసాగాడు. అలా పదిహేనేళ్లుగా బైకు కోసం ఎడతెరపి లేకుండా వెతుకుతూనే ఉన్నాడు. చివరకు సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టాడు. అయితే దేశవ్యాప్తంగా రవాణా శాఖ పూర్తి డిజిటలైజేషన్ అవ్వడం వల్ల 'పరివాహన్ సేవా పోర్టల్' అరుణ్ కు ఆశాకిరణంగా మారింది. తన బుల్లెట్ రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తుండడం తో దాని పట్టుకుని పోర్టల్ ను ఆశ్రయించాడు.

త్వరలోనే టాటా నుంచి బ్లాక్​బర్డ్​ మిడ్​ రేంజ్ ఎస్​యూవీ లాంచ్​.. సీఎన్​జీ, ఎలక్ట్రిక్​ వేరియంట్లలోనూ లభ్యం

వివిధ రవాణా శాఖ ఆఫీసుల చుట్టూ తిరిగిన తర్వాత అరుణ్.. ఫిబ్రవరి 2021లో మైసూరులోని టి.నరసిపురలోని ఒక రైతు దగ్గర తన బుల్లెట్ ఉందని తెలుసుకోగలిగాడు. గ్రామానికి చెందిన రైతు యజమానిని గుర్తించగలిగాడు. ఆ రైతుకు కాల్‌ చేసి బైకు వెనుక ఉన్న కథను వివరించాడు. ఆ బైకు తనకు ఎంతో ప్రియమైందని తెలిపాడు.

ఆ రైతు తను నడుపుతున్న మోటార్‌సైకిల్ వెనుక ఉన్న కథను తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. తాను 2015లో స్థానిక ఆటోమొబైల్ డీలర్ నుంచి 1971-మోడల్ బుల్లెట్ బైక్‌ను కొనుగోలు చేశానని, దాన్ని వేలంలో కొన్నానని చెప్పాడు. అయితే అరుణ్ కి ఆ బైకుని తిరిగి అమ్మడానికి రైతు ఒప్పుకున్నాడు.

అంతే, వెంటనే ఆ ఊరి వెళ్లి బైకుని తీసుకొచ్చారు. ఆ బైకుని కాస్త రిపేర్ చేయించి బెంగళూరు తీసుకెళ్లారు. ఆ బైకును అరుణ్‌ తన తండ్రి శ్రీనివాసన్‌కి అప్పగించగా.. అతను కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. "25 సంవత్సరాల తర్వాత నా పాత గుర్రాన్ని చూడడం చాలా గొప్ప అనుభూతి. నా కొడుకుకు కృతజ్ఞతలు" అని శ్రీనివాసన్ ఆనందంతో చెప్పారు.

First published:

Tags: Bengaluru, Bullet bike, Royal Enfield, Viral

ఉత్తమ కథలు