Boy Swallows Ganesha idol: గణేష్ విగ్రహాన్ని మింగేసిన మూడేళ్ల బాలుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

గణేష్ విగ్రహాన్ని మింగేసిన మూడేళ్ల బాలుడు..

చిన్నారులు.. ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటుంటారు. పెద్దలు జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు. ఇలాంటి ఘటనలు చాలా సార్లు జరిగాయి.

  • Share this:
    చిన్నారులు.. ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటుంటారు. పెద్దలు జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు. ఇలాంటి ఘటనలు చాలా సార్లు జరిగాయి. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. ఓ మూడేళ్ల బాలుడు.. గణేష్ విగ్రహాన్ని మింగేశాడు. వివరాలు.. బెంగళూరు నగరంలోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో చిన్నపాటి వినాయక విగ్రహం కనిపించకపోవడంతో అనుమానం తలెత్తింది. అయితే ఆడుకుంటుండగా.. ఆ ఇంట్లోని బాలుడు ఆ విగ్రహాన్ని తినే వస్తువు అనుకుని నోట్లో పెట్టుకున్నాడు. దీంతో విగ్రహాం లోనికి వెళ్లిపోయింది. ఇక, బాలుడు ఎగువ ఛాతీలో నొప్పితో బాధపడుతున్నట్టుగా గుర్తించిన కుటుంబ సభ్యుల వెంటనే ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.

    అక్కడ బాలుడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. అతని లోపలు లోహాపు విగ్రహం ఉన్నట్టుగా గుర్తించారు. వెంటనే వైద్యం అందించేందుకు సిద్దమయ్యారు. ఆ తర్వాత ఎండోస్కోపిక్ ద్వారా విగ్రహాన్ని వెంటనే తొలగించడానికి వైద్యులు ప్రయత్నించారు. విగ్రహాన్ని కొన్ని మార్గాల ద్వారా శిశువు పొత్తికడుపుకు తీసుకువచ్చారు. ఇలా ఎండోస్కోపీ ద్వారా విగ్రహాన్ని తొలగించడంలో డాక్టర్ విజయం సాధించాడు. ఆ విగ్రహాం దాదాపు 5 సెం.మీ పొడవు ఉన్నట్టుగా తెలుస్తోంది. విగ్రహం బయటకు తీసిన అనంతరం కొన్ని గంటల పాటు బాలుడిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచుకున్నారు. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. బాలుడు ఎటువంటి ప్రమాదం లేకుండా క్షేమంగా బయటపడంతో.. అతని కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.

    ఇవి చదవండి: పోర్న్ వీడియోలకు బానిసగా మారిన భర్త.. నిజం తెలుసుకున్న భార్య.. ఆమె ఏం కోరిందంటే..

    Crime News: ప్రియురాలి ఇంట్లో ప్రియుడు.. ఇలా జరుగుంతుందని అసలు ఊహించి ఉండడు.. మర్మాంగాన్ని కోసేసి..

    ఇందుకు సంబంధించి మణిపాల్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మనీష్ రాయ్ మాట్లాడుతూ.. ‘బాలుడిని ఆస్పత్రికి తీసుకొచ్చిన వెంటనే అవసరమైన పరీక్షలు నిర్వహించాం. వెంటనే విగ్రహాన్ని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టాం. బాలుడి తల్లిదండ్రులు కూడా అతడిని సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది’అని అన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: