Home /News /national /

BENGALURU BANGALORE POLICE NAB MECHANICAL ENGINEER AFTER LOSING MONEY IN ONLINE TRADING AND ROBBING A BANK SNR

మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకొని ..ఏం ఘనకార్యం వెలగబెట్టాడో చూడండి

Photo Credit: Youtube

Photo Credit: Youtube

Bangalore: బెంగళూరులో ఓ మెకానికల్ ఇంజనీర్ బ్యాంక్‌ రాబరీ చేశాడు. ఉద్యోగుల్ని బెదిరించి కేజిన్నర గోల్డ్‌, మూడున్నర లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు దొంగగా మారడానికి కారణాలు తెలిసి షాక్ అయ్యారు.

ఇంకా చదవండి ...
మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తి మంచి మార్గంలో వెళ్లాలనుకున్నాడు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో (Online trading) లక్షలు పెట్టుబడి పెట్టాడు. అవి కాస్తా వెనక్కి రాకపోవడం, చేతిలో ఉన్న డబ్బులు పోవడంతో ఆ బాధలో మరో నేరం చేయడానికి సిద్ధపడ్డాడు. అందుకోసం ఏకంగా బ్యాంక్‌ రాబరీ చేయడమే కరెక్ట్‌ అనుకున్నాడు. కర్నాటక (Karnataka)రాష్ట్రం బెంగళూరు(Bangalore)లో ఈఘటన జరిగింది. బ్యాంకు దోపిడీ(Bank robbery)కి ప్లాన్ వేసుకున్న మెకానికల్ ఇంజనీర్‌ (Mechanical engineer)పేరు ధీరజ్(Dheeraj). మడివాళ(Madiwala)లోని ఓ బ్యాంక్‌లో రాబరీకి స్కెచ్ వేసుకున్నాడు. బ్యాంక్ దగ్గరకు వెళ్లి అక్కడున్న మేనేజర్‌తో పాటు మరో మహిళ ఉద్యోగిని వెంట తెచ్చుకున్న కత్తితో బెదిరించి స్ట్రాంగ్‌ రూమ్‌(Strong room)లోని లాకర్‌ తాళాలు తీయించాడు. అందులోని 1.8కిలోల బంగారం(1.8kg gold), 3.7,200లక్షల నగదు(3.70200Cash)ను ఎత్తుకెళ్లారు. ఈ భారీ రాబరీ దృశ్యాలు బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా(cc camera)లో రికార్డయ్యాయి. బ్యాంక్‌ చోరీకి చేసిన దొంగ పని పూర్తి చేసుకొని పారిపోవడంతో ..ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్తలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్‌ పరిశీలించారు. చోరీ జరిగిన ప్రదేశం నుంచి దొంగ పారిపోయిన ప్రతి కదలికల్ని పసిగట్టేందుకు స్నేహితులను విచారించారు. నిందితుడు ధీరజ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఈ బ్యాంక్‌ చోరీ పాల్పడటానికి నిందితుడు రెక్కీ నిర్వహించినట్లుగా గుర్తించారు. చోరీకి పాల్పడిన వ్యక్తి కామాక్షిపాళ్యనికి చెందిన వాడిగా గుర్తించారు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో 30వేల జీతానికి ఉద్యోగం చేసేవాడని విచారణలో తేల్చారు. తండ్రి, సోదరుడి దగ్గరుంటున్న ధీరజ్‌ అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాధించాలన్న ఆలోచనతో అమెరికాకు చెందిన ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ కంపెనీలో 35లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. దాదాపు రెండేళ్లుగా బ్యాంక్‌లో దాచుకున్న తన జీతంతో పాటు ఇంట్లో బంగారం, స్నేహితుల దగ్గర అప్పు తెచ్చి మరీ యాప్‌తో నడిచే ట్రేడింగ్‌లో డబ్బులు పెట్టాడు.ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టిన డబ్బుకు రెట్టింపు సొమ్ము వెనక్కి వస్తుందని ఆశపడ్డ ధీరజ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ట్రేడింగ్‌లో నష్టపోవడం..పెట్టిన 35లక్షల రూపాయల్లో నయా పైసా వెనక్కి రాకపోవడంతో అప్పులు తెచ్చిన వాళ్లు వేధించడం మొదలుపెట్టారు.

అప్పులు తీర్చాలని దొంగగా మారాడు..
అప్పుల వాళ్ల బాధ తట్టుకోలేక ..పోయిన డబ్బును అడ్డదారిలో సంపాధించాలి ప్లాన్ వేసుకున్నాడు.ఇందులో భాగంగానే బ్యాంక్‌ రాబరీకి స్కెచ్‌ వేసి సక్సెస్‌ అయ్యాడు. అయితే సీసీ కెమెరాలు అతడ్ని పోలీసులకు పట్టిస్తాయన్న ఆలోచన చేయలేకపోయాడు. ఫలితంగా చోరీ జరిగిన రోజుల వ్యవధిలోనే పోలీసులు ధీరజ్‌ని పట్టుకున్నారు. ఈకేసులో నిందితుడు అప్పు ఇచ్చిన స్నేహితుడు తిరిగి డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో ఈచోరీకి పాల్పడినట్లుగా ఏసీపీ సుధీర్‌ హెగ్డే తెలిపారు.

వాడి చదువు అందుకు ఉపయోగపడింది..
మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న ధీరజ్‌ 30వేల రూపాయల జీతాన్ని వదులుకొని అత్యాశకపోవడం వల్లే నేరస్తుడిగా మారాడని బెంగళూరు పోలీసులు చెప్పారు. ట్రేడింగ్‌, ఈజీ మనీ పేరుతో ఆకర్షించే ఆన్‌లైన్‌ యాప్‌లను నమ్ముకుంటే జైలు పాలు కావడం ఖాయమని బెంగళూరు పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Bangalore, Bank news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు